ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నా.. ఇక చూసుకో బాక్సాఫీస్ బద్దలే.. ఎన్టీఆర్ ట్వీట్‌పై బ్రహ్మాజీ ఎమోషనల్

బ్రహ్మాజీ తనయుడు సంజయ్ హీరోగా వస్తోన్న చిత్రం ఓ పిట్ట కథ. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ పీక్స్‌లో ఉన్నాయి. త్రివిక్రమ్, మహేష్, హరీష్ శంకర్ వంటి ప్రముఖుల చేత పోస్టర్స్, టీజర్స్ రిలీజ్ చేయించిన బ్రహ్మాజీ ఈ మూవీపై హైప్ క్రియేట్ చేశాడు. కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేయించడం దగ్గరి నుంచి కొత్తగా ప్లాన్ చేసిన చిత్రయూనిట్ ప్రమోషన్స్‌లో ప్రతిభను చూపించింది.

భారీ ఎత్తున ప్రమోషన్స్

భారీ ఎత్తున ప్రమోషన్స్

ఈ మధ్య కాలంలో ఇలాంటి చిన్న సినిమాకు ఈ రేంజ్ ప్రమోషన్స్ ఎక్కడా జరగలేదు. స్టార్స్ అందరూ ఈ మూవీ కోసం కదిలి వచ్చారు. మెగాస్టార్ చిరంజీవిని ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పిలిచి.. అందరి దృష్టిని ఆకర్షించారు. మెగాస్టార్ స్పీచ్, బ్రహ్మాజీ స్పీచ్ ఏ రేంజ్‌లో వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

బ్రహ్మాజీ ఎమోనల్..

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మాజీ మాట్లాడుతూ.. చిరంజీవిని ఏమైనా అంటే చంపేస్తా అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఎంతో బిజీగా ఉండి కూడా మా చిన్న సినిమాను ఆశీర్వాదించడానికి వచ్చాడని తెలుపుతూ.. చిరుతో తనకున్న అనుబంధాన్ని వివరించాడు. బ్రహ్మాజీ వేదికపైనే కన్నీరు పెట్టుకోవడం తెగ వైరల్ అయింది.


తాజాగా ఈ మూవీపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించాడు. అసలే సోషల్ మీడియాకు దూరంగా ఉండే ఎన్టీఆర్ ఏదైనా పండగలకో, పబ్బాలకో ట్వీటేస్తుంటాడు. తాజాగా ఓ పిట్టకథపై ఎన్టీఆర్ ట్వీటేశాడు. ‘నా స్నేహితుడు బ్రహ్మాజీకి, ఆయన తనయుడు సంజయ్‌కు, రేపు రిలీజ్ కాబోతోన్న ఓ పిట్ట కథ యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్ ' అంటూ పోస్ట్ చేశాడు.

Recommended Video

O Pitta Katha Movie Full Interview | Brahmaji About Trivikram Srinivas Talent || Filmibeat Telugu
బ్రహ్మాజీ ఎమోషనల్..

బ్రహ్మాజీ ఎమోషనల్..

ఎన్టీఆర్ ట్వీట్‌కు క్షణాల్లో రిప్లై ఇచ్చాడు బ్రహ్మాజి. ‘అన్నా ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నా.. ఇక చూసుకో బాక్సాఫీస్ బద్దలే.. థ్యాంక్యూ డియర్.. నువ్వు నా కోసం ఎప్పుడూ ఉంటావ్.. లవ్యూ ఫరెవర్' అని ఎమోషనల్ అయ్యాడు. రేపు చిత్రయూనిట్‌ అంతా ప్రసాద్ ఐ మ్యాక్స్ 10 గంటల షో, ఏఎంబీలో సాయంత్రం షోలో సందడి చేయనున్నట్లు పేర్కొన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X