టిప్స్ ఇవ్వడానికి.. తీసుకోవడానికి హోటల్ వెయిటర్‌నా? పంచ్ విసిరిన బ్రహ్మాజీ

బ్రహ్మాజీ సినిమా ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లు అయినప్పటికీ.. ఇప్పుడే సినిమాల్లోకి వచ్చిన యువకుడిలా కనిపిస్తారు. శారీరకంగాను.. మానసికంగాను ఆయన యూత్‌కు పోటీ ఇస్తారు. వయసు పైకి కనిపించకుండా ఆయన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకొంటారు. ఓ పిట్ట కథ సినిమా ప్రమోషన్ సందర్భంగా గ్లామర్ సీక్రెట్స్ వెనుక టిప్స్ గురించి అడిగితే కామెడీ టచ్‌తో పంచ్ విసిరారు. ఆయన ఏమన్నారంటే..

సినిమా షూటింగ్‌లో నా సహచర నటీనటులకు టిప్స్ ఇవ్వడానికి, తీసుకోవడానికి నేను హోటల్ వెయిటర్‌ను కాదు అంటూ పంచ్ విసిరారు. ఆ తర్వాత తన ఆరోగ్య రహస్యం గురించి చెబుతూ.. చక్కగా కుర్చీలో కూర్చొంటే ఆరోగ్యం మన వద్ద ఉండదు. అందుకే ఉదయమే ఓ గంటపాటు ఎక్సర్‌సైజ్ చేయాలి. లేదా ఉదయం గంటపాటు పరుగెత్తాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటామని బ్రహ్మాజీ తెలిపారు.

Brahmaji Interview about O pitta Katha: Reveals his health Secrets

శారీరకంగా ఫిట్‌గా ఉంటే కాదు.. మానసికంగా కూడా బాగుండాలి. ఇతరులపై చెడుగా మాట్లాడవద్దు. మనపై మనం జోకులు వేసుకొంటే తప్పా.. మరొకరిని కామెంట్ చేయకూడదు. పలు విషయాలకు దూరంగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అని బ్రహ్మాజీ తన హెల్త్ సీక్రెట్ రివీల్ చేశారు.

ఇక బ్రహ్మాజీ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుత ఏడాదిలో రిలీజైన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో, భీష్మ లాంటి హిట్ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఓ పిట్ట కథలో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా తన కుమారుడు సంజయ్ రావును తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X