ఆ టైటిల్ పెట్టడానికి అలాంటి గుండె ధైర్యం ఉండాలి.. బ్రహ్మనందం సెన్సేషన్ కామెంట్

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, పూజ హెగ్డే హీరో, హీరోయిన్లుగా మాస్‌ కమర్షియల్‌ సినిమాల దర్శకుడు హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం 'వాల్మీకి'. తమిళ హీరో అధర్వ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. సెప్టెంబర్‌ 20న వరల్డ్‌ వైడ్‌గా విడుదల కాబోతున్న సందర్భంగా హైదరాబాద్‌ శిల్పకళావేదిక లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విక్టరి వెంకటేష్‌ హాజరయ్యి ఆడియో బిగ్‌ సిడిని విడుదలచేశారు. ఈ సందర్భంగా పలువురు సాంకేతిక నిపుణులు, నటులు మాట్లాడారు. వాల్మీకి సినిమా గురించి వారు ఏం చెప్పారంటే..

వరుణ్, పూజా పోటీపడి

వరుణ్, పూజా పోటీపడి

నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ - ''వాల్మీకి టైటిల్‌ పెట్టడానికి కొంత గుండె ధైర్యం కావాలి, అలాగే సాహిత్యం మీద పట్టు ఉండాలి. అందుకే హరీష్‌ శంకర్‌ ఈ టైటిల్‌ని ఎంచుకున్నారు అనిపిస్తుంది. ఈ సినిమాతో వరుణ్‌ అసాధారమైన నటుడు అని తెలుస్తుంది. ఈ సినిమాలో 'ఎల్లువచ్చి గోదారమ్మ' పాటలో వరుణ్‌ పూజ పోటీపడి మరీ డాన్స్‌ చేశారు. హరీష్‌ శంకర్‌ డిసిప్లేన్డ్‌ డైరెక్టర్‌. నిర్మాతలు చాలా మంచి వారు వారికి అంతా మంచే జరగాలి 'అన్నారు.

గ్యాంగ్‌స్టర్స్‌కు బాడీ లాంగ్వేజ్ నేర్పించే

గ్యాంగ్‌స్టర్స్‌కు బాడీ లాంగ్వేజ్ నేర్పించే

నటుడు బ్రహ్మాజీ మాట్లాడుతూ - ''వాల్మీకి సినిమాలో గ్యాంగ్‌‌స్టర్స్‌ అందరికీ బాడీ లాంగ్వేజ్‌ నేర్పించే చిత్ర విచిత్రమైన క్యారెక్టర్‌ నాది. ఇంతవరకూ ఇలాంటి క్యారెక్టర్‌ చేయలేదు. మా నిర్మాతలు గోపి ఆచంట, రామ్‌ ఆచంట గారికి మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. వరుణ్‌ తేజ్‌తో మొదటి సారిగా నటించాను. డిఫరెంట్‌ క్యారెక్టర్‌లో వరుణ్‌ ఇరగొట్టాడు. హరీష్‌ అద్భుతమైన మార్పులు చేసి సినిమాను తెరకెక్కించారు'' అన్నారు.

హరీష్‌కే దమ్ము, ధైర్యం ఉంటుంది

హరీష్‌కే దమ్ము, ధైర్యం ఉంటుంది

లిరిసిస్ట్‌ వనమాలి మాట్లాడుతూ - '' ఈ చిత్రంలో గగన వీధిలో అనే పాట రాశాను. ఈ కాలంలో అలాంటి పరిస్థితులకి పాట రాపించే ధమ్ము, ధైర్యం ఒక్క హరీష్‌ శంకర్‌ గారికే ఉంటాయి. వరుణ్‌ గారికి 'ఫిదా' సినిమాలో పాట రాశాను, మిక్కీ జె మేయర్‌ గారితో 13 సంవత్సరాలుగా నా అనుబంధం కొనసాగుతుంది'' అన్నారు.

నటీనటులు, సాంకేతిక వర్గం

నటీనటులు, సాంకేతిక వర్గం

నటీనటులు: మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, అధర్వ మురళి, పూజ హెగ్డే, మృణాళిని రవి, డింపుల్ తదితరులు
సంగీతం: మిక్కీ జె.మేయర్‌,
సినిమాటోగ్రఫీ: ఐనాంక బోస్‌,
ఎడిటింగ్‌: ఛోటా కె.ప్రసాద్‌,
ఫైట్స్‌: వెంకట్‌,
ఆర్ట్‌: అవినాష్‌ కొల్ల,
స్క్రీన్‌ ప్లే: మధు శ్రీనివాస్‌, మిథున్‌ చైతన్య,
లైన్ ప్రొడ్యూసర్: హరీష్‌ కట్టా,
నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపి ఆచంట,
దర్శకత్వం: హరీష్‌ శంకర్‌.ఎస్‌

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X