సన్నీ లియోన్‌తో కలిసి నటిస్తున్న బ్రహ్మానందం, సునీల్!

హాట్ లేడీ సన్నీ లియోన్ త్వరలో 'కోకా కోలా' అనే హారర్-కామెడీ సినిమా ద్వారా ప్రేక్షకులను అలరించబోతోంది. హిందీలో రూపొందుతున్న ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ కమెడియన్లు బ్రహ్మానందం, సునీల్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ నోయిడాలో జరుగుతున్నట్లు తెలుస్తోంది.

దెయ్యాలు తిరుగే ఓ బంగ్లా చుట్టూ 'కోకా కోలా' కథ ఉంటుందని, ఇందులో బ్రహ్మానందం మిడిల్ ఏజ్ రిచ్ మ్యాన్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. బ్రహ్మనందం, సునీల్, సన్నీ లియోన్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉండబోతున్నాయిని తెలుస్తోంది.

Brahmanandam and Sunil doing a horror-comedy with Sunny Leone

ఈ చిత్రంలో మరో బాలీవుడ్ బ్యూటీ మందన కరిమి కూడా నటిస్తోంది. అందాల ఆరబోత విషయంలో ఏ మాత్రం మొహమాటం లేని సన్నీ లియోన్ 'కోకా కోలా'లో గ్లామర్ డోసు మరింత పెంచబోతోందట. మందన కరిమి కూడా తక్కువేమీ కాదు. ఇప్పటికే పలు చిత్రాల్లో తన గ్లామర్‌తో కుర్రకారుకు వెర్రెక్కించింది. ఈ సినిమాలో వీరి అందాలు సినీ అభిమానులకు కనువిందు చేయడం ఖాయం అంటున్నారు.

సన్నీ లియోన్‌తో కలిసి పని చేయడంపై మందన కరిమి స్పందిస్తూ... 'గతంలో పలు ఈవెంట్లలో సన్నీ లియోన్‌ను కలిశాను. ఆమె చాలా లవ్లీ పర్సన్. ఈ సినిమా ద్వారా మేము ఆడియన్స్‌కు చాలా పెద్ద సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నామని తెలిపారు.

'కోకా కోలా' చిత్రానికి ప్రసాద్ తాతికేని దర్శకత్వం వహిస్తున్నారు. మహేంద్ర దరివాల్, పరమదీప్ సింగ్ సంధు, చిరాగ్ దరివాల్ నిర్మాతలు. ఈ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు. బ్రహ్మానందం, సునీల్‌ను తీసుకోవడం వెనక ప్రధాన కారణం అదే అని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X