Pawan Kalyan దైవాంశ సంభూతుడు.. పాన్ వరల్డ్ మూవీ కన్ఫామ్ అయిందోచ్.. ఇట్స్ అఫీషియల్

తెలుగు సినీ ప్రపంచంలో హాస్యనటుడు బ్రహ్మానందానికి ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆయన హాస్యం వల్ల హిట్‌ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు వెయ్యికిపైగా సినిమాల్లో నటించిన ఆయన.. తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటారు. అయితే ఈరోజు జులై25న బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన ఆయన.. సినిమా గురించి, అలాగే పవన్ గురించి పలు ఆసక్తి కర విషయాలు మాట్లాడారు. ఆ వివరాల్లోకి వెళితే....

లెజండరీ కమెడియన్‌: దాదాపు 1300కుపైగా సినిమాలు.. 400 మందికిపైగా దర్శకులతో పని చేసిన అనుభవం.. వందల కొద్ది అవార్డులు, పురస్కారాలు.. తెలుగు సినిమాకే గర్వకారణం ఆయన. ఇంకా చెప్పాలంటే ఆయన నటించనక్కర్లేదు. కేవలం ఎక్స్‌ప్రెషన్‌ ఒక్కటి చాలు.. సినీ ప్రియులు, ప్రేక్షకుల ముఖాల్లో చిరునవ్వులు ఆటోమెటిక్ గా చిందుతాయి. డైలాగ్‌ చెప్పారంటే.. ఎవరైనా సరే కడుపుబ్బా నవ్వాల్సిందే. ఆయనే టాలీవుడ్ చార్లీచాప్లిన్‌, కామెడీ కింగ్‌, లెజండరీ కమెడియన్‌ బ్రహ్మానందం.

Brahmanandam

వైవిధ్యమైన పాత్రలతో కంటతడి: తన కామెడీ ఎన్నో వేల మందిని నవ్వించిన బ్రహ్మానందం.. ఈ మధ్య కాలం తక్కువ చిత్రాల్లోనే కనిపిస్తున్నారు. ఈ మధ్యలోనే తనలోని మరో కోణాన్ని బయటికి తీసి సినీ ప్రియులను కంటతడి పెట్టించారు. ప్రకాష్‌రాజ్‌, రమ్యకృష్ణతో పాటు ఆయన ప్రధాన పాత్రధారులుగా వచ్చి రంగమార్తాండలో తన విశ్వరూపం చూపించి భావోద్వేగానికి గురి చేశారు. తన గద్గద స్వరంతో ఎమోషనల్‌ డైలాగ్స్, యాక్టింగ్ చెబుతూ విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు. ఈ సినిమా తర్వాత కాస్త జోరు పెంచారు. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తున్నారు.

పవన్ పై అభిమానం: ప్రస్తుతం బ్రహ్మీ పలు చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో బ్రో సినిమా కూడా ఒకటి. పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించారు. ఈ చిత్రం జులై 28న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. జులై25న బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన ఆయన.. సినిమా గురించి, అలాగే పవన్ గురించి పలు ఆసక్తి కర విషయాలు మాట్లాడారు. పవన్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

ఐ లవ్ యూ బ్రో: బ్రహ్మీ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఐ లవ్ యూ బ్రో.. కలుసుకునేందుకు అవకాశం కల్పించిన సముద్రఖని, నిర్మాతలు విశ్వప్రసాద్, వివేక్. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, మంచి నటుడు, మంచి మనసున్న మనిషి పవన్ కల్యాణ్. మై క్యూట్ బాయ్ సాయి తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్.. ఇంతమంది తేజస్ లు కలిసిన ఈ సభను చూస్తుంటుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ది గ్రేట్ పవన్ కల్యాణ్ తో ఓ చిన్న పాత్ర చేయడం అదృష్టం, ఆనందంగా ఉంది. మీ అందరి ఆశిస్సులు కలిసి పవన్ విజయాలకు తోడ్పడాలని కోరుకుంటున్నాను.

పవన్ గురించి మాట్లాడగలిగే అతి తక్కువ మంది వ్యక్తుల్లో నేను ఒక్కడిని. ఆయన నవ్వు అద్భుతం. చాలా మంచి మనిషి. పత్తికాయ పగలి.. తెల్లటి పత్తి బయటకు వచ్చినప్పుడు.. ఆ తెల్లదనంలో ఎంతటి స్పష్టత ఉంటుందో, ఎంతటి అందం ఉంటుందో.. అలాంటి అందమైన వ్యక్తి పవన్. మనిషంతా మంచితనం, హాస్యం, నవ్వు. కావాలనుకునేవారికి ఇష్టమైన అవతారంలో దర్శనమిచ్చే దైవాంశ సంభూతుడు, సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మూవీ టీమ్ కు అభినందనలు. ఇకపోతే విశ్వప్రసాద్ నా బెస్ట్ ఫ్రెండ్. గడ్స్ ఉన్న ప్రొడ్యూసర్. పాన్ వరల్డ్ సినిమా తీయగలడు" అని బ్రహ్మానందం పేర్కొన్నారు. ఆ వెంటనే నిర్మాత విశ్వప్రసాద్ మాట అందుకుని మా పాన్ వరల్డ్ సినిమా పవన్ కల్యాణ్ తోనేని క్లారిటీ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X