twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సోనూ సూద్ తరహాలో దానాలు చేశా.. కానీ చేసిన మిస్టేక్ అదొక్కటే: బ్రహ్మానందం

    |

    బాలీవుడ్ సినీ నటుడు సోనూ సూద్ ఇటీవల ఏ స్థాయిలో సహాయలు చేశాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సాధారణ జనాల నుంచి సినీ సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరు ఈ వెండితెర విలన్ పై ఎవరి స్టైల్ లో వారు ప్రశంసలు కురిపించారు. అయితే ఇటీవల టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మానందం కూడా ఒక వైపు ప్రశంసలు కురిపిస్తూనే మరోవైపు డబ్బు విలువని కూడా తెలియజేసే ప్రయత్నం చేశారు.

    మంచి పనులు నేను కూడా చేశా

    మంచి పనులు నేను కూడా చేశా

    బ్రహ్మానందం మాట్లాడుతూ.. వలసకార్మికులకు సోనూసూద్ ఎంతగానో అదుకున్నారు. ఒక సూర్యుడిలా ఆరిపోయిన జీవితలలో వెలుగులు నింపారు. అలాగే నేను కూడా ఇటీవల కాలంలో చాలా మంచి పనులు చేశాను. ప్రూఫ్ లు అడిగితే మాత్రం నా దగ్గర లేవు. ఎందుకంటే నేను సహాయం చేసినప్పుడు ఫొటోలు తీసుకోలేదు. అదొక్కటే నేను చేసిన మిస్టేక్.

    అవును డబ్బు దగ్గర కటినంగా ఉంటాను.

    అవును డబ్బు దగ్గర కటినంగా ఉంటాను.

    సూర్యుడు లాంటి సోనూ సూద్ ఎంత వెలుగు ఇచ్చాడో... నా స్థాయికి తగ్గట్టుగానే నేను ఒక మిణుగురు పురుగంత వెలుగును ఇచ్చాను అనుకుంటున్నా. ఒక పిట్ట తన ముక్కుతో కాంతిని తీసుకువెళ్లి తన గూటిలో వెలుగు నింపుతుంది. నా జీవితానికి అది చాలు. అందరూ అన్నట్లుగానే అవును నేను డబ్బు దగ్గర చాలా కటినంగా ఉంటాను.

    ఎవరో వచ్చి సాయం చేస్తారని..

    ఎవరో వచ్చి సాయం చేస్తారని..

    ఎందుకంటే.. ఎవరో వచ్చి సాయం చేస్తారని భవిష్యత్తులో ఎదురుచూడాల్సి వస్తుంది. ఒక విధంగా అది దుఃఖానికి హేతువని చెప్పవచ్చు. నా దగ్గరకు వచ్చే వారికి నేను చెప్పే విషయం ఒకటే. ఒక తినడానికి తిండి ఉంటే ఒక గూడు ఏర్పాటు చేసుకో. తిరగడానికి ఒక కారు సెట్ చేసుకుంటే చాలు. అనంతరం తిండి లేకపోయినా మీ సామాన్లు పడేసే పరిస్థితి ఉండదు.

    నేను చేసింది చాలా చిన్న దానం.

    నేను చేసింది చాలా చిన్న దానం.


    ఒక కెమెరామెన్ ఇటివల నా దగ్గరకు వచ్చి అద్దె కట్టలేని పరిస్థితి అంటూ ఇంటి సామాన్లు కూడా బయటపడేశారని ఏం చేయాలో అర్థం కావడం లేదని ఫ్యామిలీతో నా ముందుకు వచ్చాడు. ఆ సమయంలో నేను చేసింది చాలా చిన్న దానం. అయితే ఈ ప్రపంచంలో అసలైన దానం అనేది ఎవడికి ఎవడూ చేయడు.

    Recommended Video

    Brahmanandam Hails Allu Arjun & Trivikram At Ala Vaikunthapurramuloo Success Meet
    సినిమాలు తగ్గిపోవడానికి కారణం

    సినిమాలు తగ్గిపోవడానికి కారణం

    కొన్నిసార్లు నాకు సినిమాలు తగ్గిపోవడానికి కారణం ఏమిటని చాలా ప్రశ్నలు ఎదుతావుతాయి. ఆ ప్రశ్నలకు మాటలకు నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే ఏదైనా సరే ఒక సమయం వరకే నడుస్తుంది. ఒక దశ ముగిసిన అనంతరం ఎవరైనా సరే తప్పుకోవాల్సిందే. ఆకలితో ఉన్నప్పుడు భోజనం చేశాను. అది చాలనప్పుడు కూడా బాగానే తిన్నాను. ఇప్పుడు సరైనది నచ్చినది దొరికినప్పుడే తినాలని అనుకుంటున్నా అని బ్రహ్మానందం వివరణ ఇచ్చారు.

    English summary
    Brahmanandam is an actor who has made a special mark in Tollywood, no matter how many comedians. The senior comedian, who has received a variety of tags as a comedic Brahman as King Comedian, does not go into great detail. Quite silent he would do his job. But there is a talk in the industry that he is very strict when it comes to money. In a recent interview, he clarified those issues.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X