దయాకర్‌‌ని నెట్టేయలేదు... ఎర్రబెల్లితో ఫోటో వివాదంపై బ్రహ్మానందం క్లారిటీ

కామెడీ కింగ్ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు నాలుగు దశాబ్ధాలకు పైగా ఆయన తెలుగువారిని నవ్వుల్లో ముంచెత్తుతున్నారు. తన మేనరిజం, డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్‌తో గిలిగింతలు పెడుతున్నారు బ్రహ్మానందం. తెరపై కేవలం ఆయన కనిపిస్తే చాలు.. ప్రేక్షకుల ముఖాలపై నవ్వుల పువ్వులు పూస్తాయి. అంతలా తెలుగువారి హృదయాల్లో బ్రహ్మానందం స్థానం సంపాదించుకున్నారు. వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉంటారు బ్రహ్మీ. తన పని తాను చూసుకోవడం లేదంటే ఇంట్లో తన మనవడితో ఆడుకోవడం, అరుదుగా సినీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు బ్రహ్మానందం. తాజాగా ఆయన అనుకోకుండా వివాదంలో ఇరుక్కున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..

50 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న మోహన్‌బాబు
కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎంబీ 50 పేరిట హైదరాబాద్‌లో శనివారం రాత్రి ఘనంగా ఓ కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్‌కు సినీ, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు హాజరై సందడి చేశారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, సూపర్‌స్టార్ రజనీకాంత్, అల్లు అరవింద్, సురేష్ బాబు, శరత్ కుమార్, నాని, గోపీచంద్ తదితరులు హాజరై మోహన్ బాబుకు విషెస్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం కూడా పాల్గొన్నారు.

Brahmanandam gave clarity for photo controversy with ex minister Errabelli Dayakar Rao

ఎర్రబెల్లిని నెట్టేసిన బ్రహ్మానందం
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు హడావుడిగా వస్తోన్న బ్రహ్మీకి బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకార్ రావు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ఒక ఫోటో దిగుదామని చేయిపట్టుకుని దయాకర్ పక్కకు తీసుకొచ్చే ప్రయత్నం చేయగా.. బ్రహ్మానందం సున్నితంగా తిరస్కరించి ముందుకు సాగిపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బ్రహ్మానందం, ఎర్రబెల్లి ఎపిసోడ్ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తుండటంతో బ్రహ్మీ స్పందించి ఓ వీడియో రిలీజ్ చేశారు.

చనువుతో తోసేసి వెళ్లిపోయా
అందరికీ నమస్కారం.. నేను ఇవాళ పొద్దున లేవగానే ఓ వీడియో చూసి నవ్వుకున్నాను. నేను నిన్న మోహన్‌బాబు గారి ఫంక్షన్‌కి వెళ్లినప్పుడు, లేట్ అయ్యిందని కొంచెం హడావుడిగా వెళ్తున్నాను. అంతలోకి దయాన్న ఎదురయ్యాడు. ఏదో పిచ్చాపాటి మాట్లాడుకున్న తర్వాత రా అన్నా ఫోటో తీసుకుందాం అన్నాడు.. ఫోటో వద్దు ఏం వద్దని టెన్షన్‌లో లోపలికి వెళ్లిపోయాను. అది చాలామంది మిత్రులు కొంచెం అపార్ధం చేసుకున్నట్లున్నారు. దయాకర్ గారితో నాకు 30 ఏళ్ల అనుబంధం ఉంది. మంచి మిత్రులం, నేనంటే ఎంతో అభిమానంగా, ప్రేమతో చూస్తుంటాడు. మేం కూడా ఎంతో మాట్లాడుకుంటాం.. ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లా ఉంటాం. అటువంటిది సరదాగా ఆయనకున్న చనువుతోటి.. నేను ఉండండి అని చెప్పేసి, ఇలా తోసేసి వెళ్లిపోయానని బ్రహ్మానందం చెప్పారు.

అపార్ధం చేసుకోవద్దు
దాంతోటి నేను ఆయనని ఏదో కావాలని తోసినట్లు ఏదో ఒక రకమైనటువంటి మిస్ అండర్‌ స్టాండింగ్‌తోటి మీడియా మిత్రులు అలా దానిని అపార్ధం చేసుకున్నారు. అలాంటిది కాదు.. ఆ తర్వాత కూడా ఫంక్షన్‌లో నేను, ఆయన చాలాసేపు మాట్లాడుకున్నాం. అంతకుముందు మాట్లాడుకున్నాం.. ఫంక్షన్ అయ్యాక కూడా మాట్లాడుకున్నాం. కానీ ఈ వీడియో పొద్దున మేం చూడగానే నేను, ఆయన నవ్వుకున్నాం. దీనిని ఇలా మిస్ అండర్‌స్టాండింగ్ చేసుకున్నారు అని ఆయన చెప్పగా.. నేను కూడా ఇలా జరిగిందేంటీ? ఆయనని ఎక్కడ అపార్ధం చేసుకుంటారోనని అలాంటిది కాదని చెప్పడానికి, క్లారిటీ ఇవ్వడానికి మాత్రమే మీ అందరికీ చెబుతున్నాను. దయచేసి మిస్ అండర్‌స్టాండింగ్ చేసుకోవద్దు.. ఇన్ని సంవత్సరాలుగా ఆయనకి, మాకు ఉన్న అనుబంధంతో మేమిద్దరం సరదాగా అలా మాట్లాడుకున్నాం తప్ప వేరే విధంగా కాదు అని బ్రహ్మానందం క్లారిటీ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X