The Raja Saab: ప్రభాస్ మూవీలో లెజెండరీ యాక్టర్.. థియేటర్లు పగిలిపోవాల్సిందే!

టాలీవుడ్‌లోని కొందరు హీరోలు వరుసగా పాన్ ఇండియా చిత్రాలనే చేస్తున్నారు. అందులో రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడు. 'బాహుబలి' సిరీస్ తర్వాత అతడు ప్రతి చిత్రాన్ని భారీ స్కేల్‌లోనే చేస్తున్నాడు. ఇలా ఇప్పటికే చాలా చిత్రాలతో ప్రేక్షకులను, అభిమానులను అలరించాడు. అయితే, వీటిలో చాలా వరకూ నిరాశ పరచగా.. గత చిత్రం 'సలార్' మాత్రం సక్సెస్ అయింది.

రెబెల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే చాలా సినిమాలను లైన్‌లో పెట్టుకున్నాడు. వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వచ్చేలా ప్లాన్ చేసుకున్నాడు. అలా ఇప్పుడు అతడి చేతిలో ఉన్న చిత్రాల్లో 'ది రాజా సాబ్' ఒకటి. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి ఈ సినిమాను రూపొందిస్తోన్న విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయని చెప్పుకోవాలి.

Brahmanandam Key Role In Prabhas and Maruthi The Raja Saab Movie

ప్రభాస్ హీరోగా మారుతి రూపొందిస్తోన్న 'ది రాజా సాబ్' చిత్రం హర్రర్ కామెడీతో రాబోతుంది. ఈ సినిమాను సీక్రెట్‌గానే మొదలు పెట్టి చాలా షెడ్యూళ్లను జరుపుకుంటూ వచ్చారు. ఇలా ఇప్పటికే దీనికి సంబంధించి 40 శాతం వరకూ టాకీ పార్టును కూడా పూర్తి చేశారు. మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటూ వెళ్తోంది.

'ది రాజా సాబ్' మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రంలో ఎంతో మంది బడా స్టార్లు భాగం అవుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ సహా పలు ఇండస్ట్రీలకు చెందిన నటీనటులను ఎంపిక చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు లెజెండరీ యాక్టర్ బ్రహ్మానందం కూడా ఈ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.

Brahmanandam Key Role In Prabhas and Maruthi The Raja Saab Movie

గతంలో మాదిరిగా వేగంగా సినిమాలు చేయని బ్రహ్మానందంను 'ది రాజా సాబ్'లో నటించేందుకు మారుతి ఒప్పించినట్లు తెలిసింది. అంతేకాదు, ఆయన కోసం సదరు దర్శకుడు అదిరిపోయే కామెడీ క్యారెక్టర్ రాశాడట. ఇందులో ప్రభాస్ కాంబినేషన్‌లో ఆయన పండించే సన్నివేశాలు ఓ రేంజ్‌లో పేలుతాయని, ఇవన్నీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయనే టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉండగా.. 'ది రాజా సాబ్' చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. ఇక, ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని ఇస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X