అనుభవం మొత్తాన్ని రంగరించేందుకు బ్రహ్మానందం రెడీ
గిన్నీస్ రికార్డులకెక్కిన హాస్య బ్రహ్మ.. బ్రహ్మానందం గత కొన్నేళ్లు తెలుగు చిత్ర సీమలో నవ్వుల పంటను పండిచడం లేదు. వయసురిత్యా సినిమాలను తగ్గించానని, కావాలనే సినీ రంగానికి దూరంగా ఉండాలనుకుంటున్నానని ఇప్పటి వరకు చేసినవి చాలని అనుకుంటున్నట్లు పలు వేదికలపై చెప్పుకొచ్చిన సందర్భాలెన్నో. ఏవైనా కొత్తగా అనిపించిన పాత్రలను మాత్రమే చేస్తానని చెప్పిన బ్రహ్మానందంకు ఓ అదిరిపోయే క్యారెక్టర్ దొరికినట్టు తెలుస్తోంది.
కృష్ణవంశీ లాంటి దర్శకుడు మరొకరుండరంటే అతిశయోక్తి కాదు. మన తెలుగు సంప్రదాయాలను, ఆచారాలను చూపించడంలో ఆయన శైలే ప్రత్యేకం. అయితే గత కొంత కాలం నుంచి హిట్టు కొట్టలేక వెనకబడిపోయాడు. ఇటీవలె మరాఠి నట సామ్రాట్ అనే మరాఠి చిత్రానికి రీమేక్‌గా రంగమార్తాండ అనే చిత్రాన్ని తెరకెక్కించబోతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా.. బ్రహ్మానందం కూడా ఓ కీ రోల్ ప్లే చేస్తున్నాడట.

తాజాగా బ్రహ్మీ లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కాసాగింది. దీనికి సంబంధించిన ఓ జీవితంలో ఎంతో చూసిన ఒక అనుభవజ్ఞుడిలా అతడు తెరపై కనిపించబోతున్నారని తాజాగా రివీలైన బ్రహ్మీ లుక్ చెబుతోంది. నెరిసిన తలకట్టు.. పండిన గడ్డం.. పెద్ద కళ్ల జోడు.. ఈ గెటప్ చూస్తుంటే ఈ సారి బ్రహ్మీ తన నట విశ్వరూపం చూపించబోతోన్నాడని తెలుస్తోంది. ఇక ఆ స్థాయి అనుభవాలు ఘడించిన ఓ సీనియర్ సిటిజన్ పాత్రలోనే బ్రహ్మీ నటించబోతున్నారని అర్థమవుతోంది. అలా ఆ గడ్డంపై చేతిని ఆన్చి దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నారో కానీ.. ఈసారి కంటతడి పట్టించే ఎమోషన్ ఖాయమేనని ఫ్యాన్స్ కు అర్థమవుతోంది.


Click it and Unblock the Notifications











