బ్రహ్మానందం కొడుకుకు చెక్ పెట్టిన హీరోయిన్.. అలా కెరీర్‌లో బిగ్ మిస్!
ఏ ఇండస్ట్రీలో అయినా కూడా చాలా వరకు సినిమాలు అలాగే మార్కెట్ ట్రెండ్ కూడా నడిచేది హీరోలు మూలానే అని అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమాల్లో చాలా మంది హీరోయిన్స్ తమకి నామమాత్రం పాత్రలు మాత్రమే ఇస్తున్నారని వాపోయిన వారు కూడా లేకపోలేరు. ఇలా సినిమాలో మాత్రం చాలా వరకు హీరోల డామినేషన్ మాత్రమే ఉంటుంది అనుకుంటే అది ఖచ్చితంగా పొరపాటే అవుతుంది.
కాగా ఇలాంటి డామినేషన్ లో కూడా కొందరు హీరోయిన్స్ అలాగే దర్శకులు కూడా ఆ స్టార్ హీరోస్ కి అతీతంగా సాలిడ్ సినిమాలు హీరోయిన్స్ ఓరియెంటెడ్ గా చేసి హిట్స్ కొడతారు. కాగా ఇలాంటి సినిమాలు అందించడంలో దర్శకుడు శేఖర్ కమ్ముల పరిసిద్ధుడు అని చెప్పవచ్చు. టాలీవుడ్ లో తన మొదటి సినిమా నుంచి కూడా ఒక మార్క్ ని శేఖర్ కమ్ముల సెట్ చేసుకోగా తన కెరీర్ లో వచ్చిన సినిమాల్లో తెలుగు ఆడియెన్స్ కి ఎంతగానో గుర్తుండిపోయే క్లాసిక్ హిట్స్ కూడా ఉన్నాయి.

కాగా ఈ చిత్రాల్లో ఓ హిట్ ని హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కొడుకు గౌతమ్ మిస్ చేసుకున్నాడట. బ్రహ్మానందం వారసునిగా తాను ఇండస్ట్రీలో చేసిన సినిమాలు చాలా తక్కువ. ఇతర వారసుల్లా కాకుండా గతం తక్కువ సినిమాలే చేసాడు. తన మొదటి సినిమా "పల్లకిలో పెళ్లి కూతురు"తో హిట్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ తక్కువ సినిమాల్లోనే తాను కనిపించాడు.
కాగా ఈ సినిమా తర్వాత తాను శేఖర్ కమ్ములతో క్రేజీ హిట్ ని మిస్ చేసుకున్నాడు. మరి ఆ సినిమా ఏదో కూడా కాదు ఇప్పటికీ ఫ్రెష్ గా అనిపించే "గోదావరి". హీరో సుమంత్ అలాగే కమలిని ముఖర్జీ నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. కాగా ఈ సినిమాకి మొదటి ఛాయిస్ అసలు సుమంత్ కాదు గౌతమ్ అట. అయితే మొదట తన కోసమే ఈ కథ చెప్తే గౌతమ్ ఈ సినిమాని అప్పుడు రిజెక్ట్ చేసాడట.

మరి దీనికి బలమైన కారణం ఉందట. ఆ సినిమా తనకి లేడీ ఓరియెంటెడ్ సినిమాలా అనిపించింది అని తనకి ప్రాధాన్యత ఉన్న సినిమా అయితే బాగుంటుంది అని తాను ఆ సినిమా వదులుకున్నాడట. కానీ అప్పట్లో చాలా మంది పొగరు అనుకుని ఉండొచ్చు కానీ అసలు నిజం ఇది అని లేటెస్ట్ గా రివీల్ అయ్యింది. అయితే శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఆ సినిమాలో హీరోయిన్ కి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్టుగా కనిపించదు. ఒకవేళ ఈ సినిమా చేసి ఉంటే గౌతమ్ కి అప్పట్లో మంచి ప్లస్ అయ్యి ఉండొచ్చు.
రీసెంట్ టైం లో అయితే ఫిదా, లవ్ స్టోరీ లాంటి సినిమాలు కూడా శేఖర్ కమ్ముల నుంచి హీరోయిన్ సైడ్ ఎక్కువ ప్రాధాన్యత ఉన్న సినిమాల్లానే అనిపించినట్టు టాక్ వచ్చింది. నాగ చైతన్య, వరుణ్ తేజ్ లు ఉన్నప్పటికీ సాయి పల్లవికే ఎక్కువ మార్కులు పడ్డాయి. సో ఇలా జరగకూడదు అనే అప్పట్లో గౌతమ్ గోదావరి సినిమాని ముందే ఊహించి రిజెక్ట్ చేసాడని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఒక మంచి క్లాసిక్ హిట్ ని తాను మిస్ చేసుకున్నాడని చెప్పక తప్పదు.


Click it and Unblock the Notifications











