Bramayugam Twitter Review.. మమ్ముట్టి నట విశ్వరూపం.. భ్రమయుగం మాస్టర్ పీస్.. అసలు కథ ఏమిటంటే?!
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు నైట్ షిప్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ సంయుక్తంగా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం భ్రమయుగం. ఈ సినిమాకు రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహిస్తున్నారు. చక్రవర్తి రామచంద్ర, శశికాంత్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.ఈ సినిమా ఫిబ్రవరి 15వ తేదీన గ్రాండ్‌గా విడుదలైంది. ఈ సినిమా గురించి నెటిజన్లు ట్విట్టర్‌లో వెల్లడించిన రివ్యూలోకి వెళితే..

భ్రమయుగం మూవీ కల్ట్ క్లాసిక్. గుడ్ స్టోరీలైన్ ఉంది. మంచి స్క్రీన్ ప్లేను అందించారు. లీడ్ హీరోలందరూ పర్‌ఫెక్ట్ ఫెర్ఫార్మెన్స్‌ను అందించారు. కేరళ సినిమా పరిశ్రమ నుంచి ఇలాంటి సినిమాను ఇప్పటి వరకు చూడలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫి అద్బుతంగా ఉంది. నా రేటింగ్ 4/5 అని ఓ నెటిజన్ తన రివ్యూను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
భ్రమయుగం సినిమా చూశాను. సినిమా హాల్ నుంచి బయటకు వచ్చిన 3 గంటల తర్వాత కూడా దాని గురించి ఆలోచిస్తూనే ఉన్నాను. ఆ సినిమా కథ, కథనాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. మమ్ముట్టి పెర్ఫార్మెన్స్ అద్బుతంగా ఉంది. నంబూద్రి మాన్షన్ సెటప్ ఎక్సలెంట్‌గా ఉంది. వెన్నులో చలిపుట్టించేలా ట్విస్టులు ఉన్నాయి. తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. నా రేటింగ్ 3.5/5 అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
భ్రమయుగం సినిమా ఫస్టాఫ్ బాగుంది. సినిమా కొంచెం ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. మమ్ముట్టి స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. బ్లాక్ అండ్ వైట్ సినిమాలో సౌండ్స్ అదిరిపోయాయి. ఈ సినిమా కొత్త అనుభూతిని పంచుతుంది అని నెటిజన్ కామెంట్ చేశాడు.
భ్రమయుగం సినిమా తప్పకుండా థియేటర్‌లోనే చూడాల్సిన సినిమా. ఈ సినిమాలో కొన్ని సీన్లు అద్బుతంగా ఉన్నాయి. డైరెక్టర్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
భ్రమయుగం సినిమాలో మమ్ముట్టి సంభవం స్క్రీన్ ప్రజెన్స్ అదిరిపోయింది. ఓ డిఫరెంట్ అనుభూతిని పొందాను. సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ థ్రిల్లింగ్‌గా ఉంది. ఈ సినిమాలో సోషియో, పొలిటికల్ మెసేజ్ బాగుంది. బీజీఎం, ఆర్ట్ వర్క్, కెమెరా పనితనం బాగుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
భ్రమయుగం సినిమా మస్ట్ వాచ్ మూవీ. ఈ సినిమాను బిగ్ స్క్రీన్‌లోనే చూడాలి. ఇటీవల కాలంలో ఇలాంటి సినిమాను చూడలేదు. ఈ సినిమా కథ, నటీనటుల పెర్ఫార్మెన్స్, సినిమాటోగ్రఫి, ది సౌండ్ డిజైన్ అద్బుతంగా ఉంది. ఈ సినిమా ఓ మాస్టర్ పీస్. అసలు మిస్ చేసుకోవద్దు అని ఓ నెటిజన్ రివ్యూ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











