బ్రాందీ డైరీస్ మరో అర్జున్ రెడ్డి .. ఆకట్టుకొంటున్న మూవీ ట్రైలర్!
కలెక్టీవ్ డ్రీమర్స్ పతాకంపై యువ హీరో, హీరోయిన్లు గరుడ శేఖర్, సునీత సద్గురు జంటగా శివుడు దర్శకత్వంలో లేళ్ల శ్రీకాంత్ మరియు మిత్ర బృందం నిర్మించిన క్రౌడ్ ఫండెడ్ చిత్రం బ్రాందీ డైరీస్. ఈ చిత్రానికి ప్రకాశ్ రెక్స్ సంగీతాన్ని అందించగా జానపద గాయకుడు రచయిత పెంచల దాసు ఓ పాటకు సాహిత్యాన్ని అందించారు. సాయి చరణ్, హరిచరణ్ మరియు రవికుమార్ విందా నేపథ్య గానం సమకూర్చారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ చేశారు.ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాతలు ప్రసన్న కుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
బ్రాందీ డైరీస్ ట్రైలర్ ఆవిష్కరణ అనంతరం తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. చాలా వరకు కథా బలం లేకుండా సినిమాలు వస్తున్నాయి. కానీ బ్రాందీ డైరీస్ మంచి కథబలం ఉన్న సినిమా. ఇటీవలే సినిమా చూశాను. ఇది అర్జున్ రెడ్డి లాంటి సినిమా. అందరికీ అంత పేరొచ్చే సినిమా అవుతుంది అని అన్నారు.

ప్రసన్న కుమార్ మాట్లాడుతూ " కరోన టైంలో భయపడని ఎలిమెంట్ ఏదైనా ఉందంటే అది బ్రాందీ షాపులే. మద్యం అనేది చాలా మందికి నిత్యవసం అయిపోయింది. సినిమాకు పర్ఫెక్ట్ టైటిల్ పెట్టారు. అద్భుతమైన టైటిల్ ఇది. చిన్న సినిమాల మధ్య వచ్చి ఇబ్బంది పడకుండా పెద్ద సినిమాతో వస్తే కొన్ని థియేటర్స్ లభిస్తాయి. ఏప్రిల్ 10 న వస్తే బెటర్‌గా ఉంటుందని నా సలహా. మద్యం గురించి తీసిన ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నా"అన్నారు.

చిత్ర దర్శకుడు శివుడు మాట్లాడుతూ....ఈ సినిమా కథకు కరెక్ట్‌గా యాప్ట్ అవుతుందని "బ్రాందీ డైరీస్" టైటిల్ పెట్టాం. ఈ సినిమా కథ ఆరుగురు వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. ఆల్కహాల్ తాగితే వచ్చే ఇబ్బందులు ఏమిటి, దాని వలన ఎం నస్టం జరుగుతుందనే విషయాన్ని ఈ చిత్రం ద్వారా తెలియజేస్తున్నాం. సినిమా మొదటి నుంచి ఎండింగ్ వరకు బ్రాందీ(అల్కాహాల్) మీదనే కథ నడుస్తుంది. ఇప్పటి వరకూ తెలుగులో ఇటువంటి సినిమా రాలేదు అని అన్నారు.
నిర్మాత శ్రీకాంత్ లేళ్ల మాట్లాడుతూ .. బ్రాందీ డైరీస్ సహజత్వానికి పట్టం కడుతూ పూర్తిగా కొత్త నటీనటులతో సినిమా రూపుదిద్దుకుంది. కథే ముఖ్య పాత్రగా 52 రోజుల్లో 104 లొకేషన్లలో సింగిల్ షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేశాం. తక్కువ బడ్జెట్ లో ఎక్కువ నాణ్యతతో తీసిన మా సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది అని అన్నారు.

హీరో శేఖర్ మాట్లాడుతూ...సినిమా గురించి నాకు ఏవిధమైన అవగాహన లేకున్నా ఈ సినిమా కోసం నన్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దర్శక నిర్మాతల సపోర్టుతో సినిమా చేయడం జరిగింది. నాకు ఈ సినిమా ఆఫర్ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. దాదాపు రెండు నెలలు నాకు ట్రైనింగ్ ఇచ్చారు అని అన్నారు
హీరోయిన్ సునీత సద్గురు మాట్లాడుతూ .. బ్రాందీ డైరీస్ సినిమా ఓ సందేశాత్మక చిత్రం. ఈ చిత్రంలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సినిమాలో నటించినప్పుడు ఆల్కహాల్ మీద కూడా సినిమా తీయొచ్చా అనిపించింది. ఆల్కహాల్ వల్ల జరిగే నష్టాలను తెలుపుతూ చక్కటి లవ్ స్టోరీని జోడించి ప్రేక్షకులకు నచ్చే విధంగా చేయడం జరిగింది. నాకీ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు.
శ్రద్దాకపూర్ లవ్లీ అండ్ గ్లామరస్ ఫోటోషూట్..
నటీనటులు: గరుడ శేఖర్, సునీత సద్గురు, నవీన్ వర్మ, కేవీ .శ్రీనివాస్, రవీందర్ బాబు, దినేష్ తదితరులు
నిర్మాత: లేళ్ల శ్రీకాంత్
రచన, దర్శకత్వం: శివుడు
సంగీతం: ప్రకాష్ రెక్స్
సినిమాటోగ్రఫీ: ఈశ్వరన్ తంగవేల్
ఎడిటర్: యోగ శ్రీనివాస్
బ్యానర్: కలెక్టివ్ డ్రీమ్స్


Click it and Unblock the Notifications











