Breaking: అఖండ 2 రిలీజ్ నిరవధికంగా వాయిదా.. బాలకృష్ణ మూవీ విడుదల వాయిదా ఎందుకంటే?

భారీ అంచనాలతో విడుదలకు సిద్దమైన అఖండ 2 చిత్రం రిలీజ్ నిరవధికంగా వాయిదా పడింది. తెలుగు ప్రేక్షకులకు గాడ్ ఆఫ్ మాసెస్, నటరత్న నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం అఖండ 2: తాండవం. బ్లాక్‌బస్టర్ సాధించిన అఖండ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాకు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాను బాలకృష్ణ కూతురు తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

భారీ బడ్జెట్, హై ఆక్టేన్ యాక్షన్ సీన్లతో రూపొందుతున్న ఈ సినిమాకు ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సీ రామ్ ప్రసాద్, సంతోష్ డీ డీటాకే సినిమాటోగ్రఫిని, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్, తమ్మిరాజు ఎడిటర్‌గా, రామ్ లక్ష్మణ్ ఫైట్స్ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాకు కోటి పర్చూరి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ సినిమా విడుదల వాయిదా పడింది. అయితే డిసెంబర్ 4 వ తేదీన ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేయాలంటూ ఎరోస్ ఇంటర్నేషన్ సంస్థ మద్రాస్ కోర్టును ఆశ్రయించడంతో వివాదంగా మారింది. రాత్రి వరకు ఎరోస్ సంస్థతో జరిపిన చర్చలు విఫలం కావడంతో సినిమా నిరవధికంగా వాయిదా వేశారు.

Akhanda 2 Movie Release Postponed indefinitely

అధికారికంగా 14 రీల్స్ ప్లస్ ట్విట్టర్‌లో తెలిపిన ప్రకారం.. భారమైన హృదయంతో అఖండ 2 సినిమా వాయిదా వేశామని తెలియచేయడానికి చింతిస్తున్నాం. కొన్ని పరిష్కరించలేని పరిస్థితుల కారణంగా ఈ సినిమాను నిర్ణీత సమయానికి రిలీజ్ చేయలేకపోయాం. మాకు చాలా బాధాకరమైన విషయం. ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్న ప్రతీ ఒక్కరికి, అభిమానికి ఈ వాయిదా తీవ్ర నిరాశను కలిగించి ఉంటుంది. వారి పరిస్థితిని మేము అర్ధం చేసుకోగలం అని అన్నారు.

అఖండ 2 సినిమా రిలీజ్ చుట్టూ నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు మేము అనుక్షణం ప్రయత్నిస్తూనే ఉన్నాం. అభిమానులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ క్షమాపణలు తెలియజేస్తున్నాం. ఈ విపత్కర సమయంలో మీ సహకారం మాకు కొండంత బలం. ఈ సినిమా రిలీజ్ గురించి పాజిటివ్ అప్‌డేట్‌ను త్వరలోనే అందిస్తాం అని 14 రీల్స్ ప్లస్ తమ ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఓవర్సీస్‌లో కూడా అఖండ 2 సినిమా రిలీజ్ కూడా వాయిదా పడింది. సినిమా ప్రదర్శనకు కావాల్సిన కేడీఎం కూడా జారీ చేయలేదు. దాంతో నిరవధికంగా ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్టు సోషల్ మీడియాలో ట్రేడ్ అనలిస్టు వెంకీ పోస్టులు పెట్టారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X