జానీ మాస్టర్‌కు షాక్.. నేషనల్ అవార్డు రద్దు.. బెయిల్ క్యాన్సిల్ తప్పదా?

లైంగిక దాడి కేసులోను, అలాగే పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు లభించిన జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డు‌ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. దాంతో ఆయనకు ఇచ్చిన బెయిల్ కూడా రద్దు అయ్యే పరిస్థితి నెలకొన్నది. ఈ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

కొద్దిరోజుల క్రితం తనను లైంగికంగా వేధించి.. తాను మైనర్ బాలికగా ఉన్న సమయంలోనే అత్యాచారం చేశారని ఓ మహిళా కొరియోగ్రాఫర్ ఆరోపిస్తూ నార్సింగి కోర్టులో కేసు నమోదు చేసింది. దాంతో ఆయనను వెంటాడి కర్ణాటక, గోవా సరిహద్దులోని ఓ ప్రాంతంలో అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. అనంతరం రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరుచగా 14 రోజుల రిమాండ్ విధించి చంచల్‌గూడ జైలుకు తరలించారు.

Breaking Jani Master s National Best Choreographer Awards Cancelled Is Bail also taken back

అనంతరం జానీ మాస్టర్‌ను పోలీస్ కస్టడీకి తరలించి విచారించారు. విచారణ అనంతరం కోర్టులో హాజరుపరుచగా ఆయనకు మరికొన్ని రోజులు రిమాండ్ విధించింది. అయితే ఆయనకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా ప్రకటించారు. అక్టోబర్ 8వ తేదీన జాతీయ అవార్డుల ప్రధానం జరుగనున్నది. ఈ క్రమంలో ఆ అవార్డును అందుకోవడానికి వెళ్లాల్సి ఉందని బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

అయితే జానీ మాస్టర్ తరఫున దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఎల్బీ నగర్ కోర్టు విచారించింది. పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనకు అవార్డు అందుకోవడానికి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. అక్టోబర్ 6 తేదీ నుంచి 10వ తేదీ వరకు బెయిల్ మంజూరు చేసింది. దాంతో ఆయనకు కొంత ఊరట లభించిందని అందరూ భావించారు.

Breaking Jani Master s National Best Choreographer Awards Cancelled Is Bail also taken back

కానీ జానీ అవార్డుకు ప్రకటించిన జాతీయ అవార్డును రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకొన్నది. తమిళంలో ధనుష్, నిత్యామీనన్ నటించిన తిరుచిత్రాంబళం సినిమాలోని పాటకు గాను జానీ మాస్టర్‌కు జాతీయ అవార్డు లభించింది. అయితే పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ రిమాండ్‌లో ఉన్నారు. అందుచేత ఆయనకు ప్రకటించిన అవార్డును రద్దు చేశాం. ఈ నెల 8వ తేదీన ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అవార్డు అందుకోవడానికి అనర్హుడు అని తమ లేఖలో పేర్కొన్నారు. దాంతో ఆయన వర్గీయులు షాక్ గురయ్యారు. అవార్డు నిరాకరించిన నేపథ్యంలో బెయిల్ కూడా రద్దు చేసే అవకాశం ఉంది. ఈ విషయంపై కోర్టు సోమవారం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

More from Filmibeat

Read more about: jani master tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X