"పుష్ప 2" తొక్కిసలాట .. ఆ ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎవరెవరు అంటే?
తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ భారీ చిత్రం వస్తుంది అంటే అది ఏ రేంజ్‌లో హంగామా సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్ఫాల్సిన పని లేదు. కాకపోతే ఈ సమయంలోనే ఆ సినిమాల వల్ల ఒక్కోసారి తీరని నష్టాలు కూడా జరుగుతాయి. తమ అభిమాన హీరో మీద ఉన్న ప్రేమతో ఫ్లెక్స్ లు పెట్టే సమయంలో కరెంటు తీగలు తగిలి చనిపోవడం .. టికెట్స్ కోసం తొక్కిసలాటలు, పోలీసుల చేతుల్లో లాఠీ దెబ్బలు.. ఇలా చాలానే అంశాలు అభిమానులతో పాటు సామాన్య జనానికి కూడా నష్టాలు మిగులుస్తాయి.
కాగా రీసెంట్‌గా టాలీవుడ్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ "పుష్ప 2". టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ తెరకెక్కించారు. పార్ట్ 1 పుష్ప ది రైజ్ పాన్ ఇండియా వైడ్‌గా మంచి విజయాన్ని సాధించేసరికి ఇపుడు పార్ట్ 2పై ఎనలేని హైప్ వచ్చేసింది. దీనితో సినిమా చూసేందుకు జనం ఎగబడ్డారు. ఇదే ఇపుడు ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.

పుష్ప 2 ఒరిజినల్ రిలీజ్ డేట్ కంటే ముందే డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9 గంటల 30 నిమిషాల నుంచే ప్రీమియర్స్ పడిపోయాయి. దీనికి తోడు హైదరాబాద్ లోని ఫేమస్ సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న సంధ్య 70 ఎంఎం థియేటర్స్‌కి అల్లు అర్జున్ రావడంతో తొక్కిసలాట జరిగి ఓ ప్రాణం పోయింది. ఇది ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీగా మారిన సంగతి తెలిసిందే.
కాగా దీనిపై స్వయంగా హీరో అల్లు అర్జున్ కూడా స్పందించి కుటుంబానికి ముందు రూ.25 లక్షలు పరిహారం ప్రకటించాడు. అయితే దీనిపైనా విమర్శలు వచ్చాయి. బాధిత కుటుంబం అల్లు అర్జున్ సహా థియేటర్ యాజమాన్యంపై కేసు పెట్టిన మాట బయటకి వచ్చింది. కాగా ఇపుడు దీనికి సంబంధించి ఓ బ్రేకింగ్ న్యూస్ బయటకి వచ్చింది.
ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు బిగ్ ట్విస్ట్ ఇస్తూ థియేటర్ కి సంబంధించిన మెయిన్ యజమాని అలాగే థియేటర్ మేనేజర్ సహా అక్కడ సెక్యూరిటీ సరిగ్గా చూసుకోవడంలో విఫలం అయ్యిన సెక్యూరిటీ మేనేజర్ ని కూడా అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారట. దీనితో ఈ న్యూస్ ఇపుడు టాలీవుడ్‌లో కలకలం రేపుతోంది.
ఈ కేసులోనే అల్లు అర్జున్ పేరు కూడా చేర్చారు అని టాక్ వచ్చింది . కానీ తన విషయంలో ఎలాంటి పురోగతి లేదని అంటున్నారు. మరి ఈ కేసు విషయంలో సంధ్య థియేటర్ యాజమాన్యం ఏం చేస్తుందో? ఈ కేసు ఎక్కడి వరకు వెళుతుందో అనేది మరింత సస్పెన్స్ గా మారింది. ప్రస్తుతానికి అయితే పుష్ప 2 వరల్డ్ వైడ్ గా భారీ వసూళ్లతో దూసుకెళ్తుంది.


Click it and Unblock the Notifications











