twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్రేకింగ్: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత ఆత్మహత్య

    |

    ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ప్రముఖ నిర్మాత క‌పాలి మోహ‌న్ (59) ఆత్మహత్య చేసుకున్నారనే వార్త కన్నడ సినీ పరిశ్రమలో విషాదం నింపింది. ఆ నిర్మాత ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? ఆ పరిస్థితులేంటి? వివరాల్లోకి పోతే..

    నిర్మాతగా గుర్తింపు.. క‌పాలి మోహ‌న్ ఆత్మహత్య

    నిర్మాతగా గుర్తింపు.. క‌పాలి మోహ‌న్ ఆత్మహత్య

    పలు కన్నడ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు వ్యాపారవేత్త వీకే మోహన్. వ్యాపారంతో చేస్తూనే సినీ నిర్మాతగా ఎదిగిన ఆయన క‌పాలి మోహ‌న్ గా కన్నడ సినీ పరిశ్రమలో గుర్తింపు పొందారు. మొదటి నుంచే సినిమాలతో వేరే వ్యాపారాలు చేసుకుంటూ వస్తున్న క‌పాలి మోహ‌న్ ఊహించని విధంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు.

    ఆత్మహత్యకు కారణం..

    ఆత్మహత్యకు కారణం..

    బెంగ‌ళూరులోని పీన్యా ప్రాంతంలోని హోట‌ల్‌లో ఉరివేసుకొని ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఆత్మహత్యకు కారణం వ్యాపారంలో వచ్చిన నష్టాలే అని సమాచారం. వ్యాపారంతో పాటు సినిమాల్లో కూడా నష్టం రావడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది.

    పోలీస్ స్టేషన్‌ పరిధిలోనే హోటల్.. చ‌నిపోవ‌డానికి ముందు!

    పోలీస్ స్టేషన్‌ పరిధిలోనే హోటల్.. చ‌నిపోవ‌డానికి ముందు!

    గంగమ్మగుడి పోలీస్ స్టేషన్‌ పరిధిలోని బసవేశ్వర కేఎస్‌ఆర్‌టీసీ బస్టాండ్‌కు సమీపంలో సుప్రీం అనే హోటల్‌ను నిర్వహిస్తున్నారు కాపాలి మోహన్. ఆ దగ్గరలోని స‌దాశివం న‌గ‌ర్‌లోనే నివ‌సిస్తున్నారు. చ‌నిపోవ‌డానికి ముందు త‌న స్నేహితుడు మంజునాథ్‌తో క‌లిసి భోజనం చేసిన ఆయన.. ఆ తర్వాత ఉరి వేసుకొని మరణించారని చెబుతున్నారు.

    వాళ్లకు విన్నపం చేస్తూ ఆత్మహత్య

    వాళ్లకు విన్నపం చేస్తూ ఆత్మహత్య

    ఆత్మహత్యకు ముందు త‌న కొడుకుతో కూడా ఫోన్‌లో మాట్టాడిన నిర్మాత కాపాలి మోహన్.. ఆ తర్వాత ప్ర‌త్యేక వీడియోలో కూడా మాట్లాడారు. తనకు హోటల్లో నష్టం వచ్చిందని సీఎం య‌డ్యూర‌ప్ప‌, డీసీఎం లక్ష్మణ సవదికి విన్నపం చేస్తూ.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా ఆ వీడియో ద్వారా చెప్పారని తెలిసింది.

     సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం

    సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం

    నిర్మాత కాపాలి మోహన్ మృతితో కన్నడ చిత్ర పరిశ్రమ షాక్‌కి గురైంది. ఆయన మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

    English summary
    Producer and distributor V K Mohan (Kapali Mohan) committed suicide by hanging self at his hotel located in Peenya.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X