కరోనాతో ప్రముఖ కమెడియన్ మృతి.. విషాదంలో సన్నిహితులు

బ్రిటన్‌కు చెందిన కమెడియన్ టిమ్ బ్రూక్ టేలర్ ఇకలేరు. కరోనావ్యాధితో బాధపడుతూ ఆదివారం ఉదయం మరణించారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొవిడ్ 19తో మరణించారని ఆయన సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు. ది గుడీస్ విత్ గ్రేమే గార్డన్, బిల్ ఓడ్డి చిత్రాల ద్వారా అత్యంత ప్రజాదరణ పొందారు.

నటుడిగానే కాకుండా క్రేంబ్రిడ్జి యూనివర్సిటీలోని ఫూట్ లైట్ రెవ్యూతో భాగస్వామ్యం అయ్యారు. గత కొద్దికాలంగా బ్రిటన్‌లో కామిక్ టాలెంట్‌ను ప్రోత్సహించే పనిలో ఉన్నారు. రేడియో, టెలివిజన్ కార్యక్రమాల్లో తనదైన కామెడీని పండించారు. 60 దశకంలో రేడియోలో తనదైన హాస్యంతో శ్రోతలకు నవ్వుల పువ్వులు పూయించారు. ఆ కాలంలో పైథాన్ అనే స్థంస్థను స్థాపించి జాన్ క్లీస్, గ్రాహం చాపమ్యాన్ లాంటి వారితొ కలిసి ప్రదర్శనలు ఇచ్చారు.

British comedian Tim Brooke-Taylor no more

టిమ్ బ్రూక్ టేలర్ మరణవార్తపై గూడీస్ కోస్టార్ స్పందిస్తూ.. చాలా సరదాగా ఉండేవారు. సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తి. ఉదారత, దయాగుణం ఆయన లక్షణం. ఆయనతో పనిచేయడం అంటే చెప్పలేనంత సరదాగా ఉంటుంది. ఎప్పుడూ ఉత్సాహంతో ఉరకలేస్తుంటారు. ఆయన లేని లోటు కామెడీ లోకానికి తీరని లోటు. మా తుదిశ్వాస విడిచేంత వరకు మా మనసులో ఆయన ఎప్పుడూ ఉంటారు. మా మధ్య ఆయన లేకపోవడం చాలా బాధకరం అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X