ఎడీ షీరాన్ నోట దేవర పాట.. చుట్టమల్లే అంటూ పాటకు తారక్ ఫ్యాన్స్ ఫిదా!

బ్రిటిష్ సింగర్ ఎడీ షీరాన్ ఆల్బమ్స్ ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఆదరణ పొందాయో తెలిసిందే. ఆయన క్రియేట్ చేసిన 'షేప్ ఆఫ్ లవ్' సాంగ్ కు బిలియన్ల వ్యూస్ తో పాటు ప్రపంచ సంగీత ప్రియులు ఊగిపోయారు. ఇండియాలోనూ ఆయనకు అత్యధికంగానే అభిమానులున్నాయి. గతంలో అకాన్, జస్టీన్ బైబర్, ఎలాన్ వాకర్ వంటి వరల్డ్ ఫేమ్ సింగర్స్ కూడా ప్రపంచ వ్యాప్తంగా తమ ఆల్బమ్స్ ను హిట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇంగ్లీష్ నుంచి ఇలా చెప్పుకుంటూ పోతే వందల మందిని ప్రస్తావించాల్సి వస్తుంది. వరల్డ్ వైడ్ గా ఈ పాప్ సింగర్స్ కు ఉన్న ఆదరణ అలాంటింది.

అయితే.. ఎడీ షీరాన్ వార్త ఒకటి ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. ముఖ్యంగా గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే... ఎందుకంటే తారక్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న 'దేవర' మూవీ గతేడాది విడుదలై దుమ్ములేపిన విషయం తెలిసిందే. సినిమాతో పాటు ఆ చిత్ర పాటలు కూడా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో తెలిసిందే. ముఖ్యంగా 'చుట్టమల్లె' సాంగ్ కు యువత నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఆ పాటను అంత అద్భుతంగా ట్యూన్ చేశారు మరి మన అనిరుధ్ రవిచంద్రన్.

British Singer Ed Sheeran sings NTR Janvi Kapoors Devara Movie Song Chuttammalle

కాగా.. ఇప్పుడు అదే పాటను ఇంటర్నేషనల్ పాప్ సింగర్ ఎడీ షీరాన్ పాడటం ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ పాటను ఇంటర్నేషనల్ సింగర్ పాడటం ఫ్యాన్స్ కు మరింతగా కిక్కునిస్తోంది. ఇంతకీ ఆయనెందుకు పాడారనేదానికి వస్తే.. తాజాగా బెంగళూరులో ఎడీ షీరాన్ స్ట్రీట్ పెర్ఫామెన్స్ ఒకటి ఉండింది. కానీ ఆ షోను బెంగళూరు పోలీసులు అనుకోకుండా రద్దు చేశారు. దాంతో ఎడీ షీరాన్ కోసం వచ్చిన ఫ్యాన్స్ అంతా అప్సెట్ అయ్యారు. కానీ ఇదే సమయంలో ఎడీ షీరాన్ 'దేవర' సాంగ్ లోని 'చుట్టమల్లె' సాంగ్ ను పాడి ఫ్యాన్స్ ను ఫిదా చేశారు.

ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికే ఆ వీడియోను నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు. ఎడీ షీరాన్ తెలుగు పదాలను కూడా ఎంతో చక్కగా, అర్థవంతంగా ఉచ్ఛరిస్తుండటం మరింత ఆసక్తికరంగా మారింది. ఎడీ షీరాన్ చుట్టమల్లె సాంగ్ పాడటంతో అటు జాన్వీ కపూర్ కూడా ఇంప్రెస్ అయ్యి స్పందించింది. పలువురు తారలు కూడా ఆ వీడియోకు స్పందిస్తున్నారు. తారక్ ఫ్యాన్స్ మాత్రం 'చుట్టమల్లె' సాంగ్ ను ఎడీ షీరాన్ వాయిస్ లో వింటూ మరింతగా ఎంజాయ్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ తారక్ నుంచి నెక్ట్స్ ప్రాజెక్ట్స్ అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. వార్2, దేవర2, ఎన్టీఆర్31 చిత్రాల అప్డేట్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. త్వరలోనే తారక్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్ చెప్పబోతున్నారని తెలుస్తోంది. ఇక 'దేవర' సినిమా గతేడాది విడుదలై ఆశించిన మేర కాకపోయినా మంచి రెస్పాన్స్ నే అందుకుంది. ముఖ్యంగా బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది.

More from Filmibeat

Read more about: ntr devara
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X