Bro The Avatar: మార్క్ పాత్రతో సాయి ధరమ్ తేజ్ సర్‌ప్రైజ్ .. మెగా లుక్ అదుర్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న మొట్టమొదటి చిత్రం బ్రో. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రేక్షకులు అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి. తమిళం లో మంచి విజయాన్ని అందుకున్న వినోదయా సీతమ్ సినిమాకు రీమేక్ అయినప్పటికీ కూడా దర్శకుడు సముద్రఖని తెలుగు ప్రేక్షకులకు వచ్చే విధంగా డిఫరెంట్ గా BRO సినిమాను తెరపైకి తీసుకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ అందిస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఇప్పటికే సగానికి పైగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. ప్రస్తుతం దర్శకుడు సాయిధరమ్ తేజ్ పాత్రకు సంబంధించిన కొన్ని సీన్స్ ను షూట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

Bro movie mega hero sai dharam tej mark first look released

ఇటీవల పవన్ కళ్యాణ్ స్టిల్ తో పాటు అలాగే రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేశారు. వాటికి అద్భుతమైన స్పందన లభించింది. అయితే ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ కు సంబంధించిన ఒక లుక్ కూడా విడుదల చేయడం జరిగింది. మార్కండేయుడు మార్క్ పాత్రలో సాయి ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఇక వైట్ కోట్ లో అతను ఉన్న ఒక స్టిల్ అద్భుతంగా ఉంది. సోషల్ మీడియాలో ఈ లుక్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇప్పటికే విరూపాక్ష సినిమాతో మంచి సక్సెస్ అనుకున్న సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు బ్రో సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకునేలా కనిపించబోతున్నాడు. ఈ సినిమాను జూలై 24వ తేదీన విడుదల చేయాలని దర్శకుడు సముద్రఖని ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా సినిమా షూటింగ్ చేస్తున్నాడు.

ఇక బ్రో సినిమాలో కేతిక శర్మ ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా ముఖ్యమైన పాత్రలలో కనిపించబోతున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. బ్రో సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X