BRO: ఒకేసారి వస్తున్న మెగా హీరోలు.. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా!
రీఎంట్రీ తర్వాత ఏకధాటిగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు టాలీవుడ్ టాప్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇప్పుడు అతడు చేస్తోన్న సినిమాల్లో 'బ్రో (BRO)' ఒకటి. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఇందులో నటిస్తుండడంతో ఈ చిత్రం మెగా మల్టీస్టారర్‌గా మారింది. సముద్రఖని దర్శకత్వంలో వచ్చి తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన 'వినోదయ సీతమ్' సినిమాకు ఇది రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు.
దేవుడు, భక్తుడు కాన్సెప్టుతో రూపొందుతోన్న 'బ్రో (BRO)' సినిమాకు ప్రముఖ దర్శకుడు, నటుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను గత ఫిబ్రవరిలో మొదలు పెట్టారు. ఆ వెంటనే పవన్ కల్యాణ్‌కు సంబంధించిన చాలా వరకు షూటింగ్‌ను కూడా కంప్లీట్ చేసేశారు. ఇక, ఇప్పుడు సాయి ధరమ్ తేజ్‌పై ఫేమస్ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో చిత్రీకరణ జరుపుతున్నారు. ఇందులో పవన్ కల్యాణ్ కూడా భాగం అయ్యాడు. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది.

మెగా హీరోల కలయికలో తెరకెక్కుతోన్న 'బ్రో (BRO)' మూవీ నుంచి వచ్చిన పోస్టర్లు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు దీని నుంచి మరో సర్‌ప్రైజ్ రాబోతుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఇందులో పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి ఉన్న పోస్టర్‌ను మే 29న ఉదయం 10:08 గంటలకు విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు తాజాగా పవన్ కల్యాణ్, సాయి తేజ్ షూటింగ్ స్పాట్‌లో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసింది. దీంతో కొత్త పోస్టర్‌పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.
పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న 'బ్రో (BRO)' చిత్రంలో బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్లు కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ నటిస్తోన్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్‌ప్లేకు వర్క్ చేస్తున్నారు. థమన్ సంగీతం ఇస్తున్నాడు. దీన్ని జూలై 28న విడుదల చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











