PKSDT టైటిల్ BRO.. పవన్ కల్యాణ్ మూవీ మోషన్ పోస్టర్ ఎలా ఉందంటే?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్‌లో నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా టైటిల్, మోషన్ పోస్టర్‌ను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ రిలీజ్ చేసింది.
తమిళంలో సముద్రఖని దర్శకత్వం వహించి రూపొందించిన వినోదయ సీతమ్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తూ ప్రేక్షకులకు అందించే ప్రయత్నం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే.ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా టైటిల్‌ను రివీల్ చేయడమే కాకుండా మోషన్ పోస్టర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమా పేరు ఏంటి? మోషన్ పోస్టర్ ఎలా ఉందనే విషయంలోకి వెళితే..

సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతున్న వినోదయ సీతమ్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా టైటిల్ ఇదే నంటూ మీడియాలో అనేక పేర్లు బయటకు వచ్చాయి. అయితే ఇటీవల కాలంలో ఎక్కువగా వైరల్‌గా టైటిల్ దేవుడే దిగి వచ్చినా టైటిల్ అని వినిపించింది. దీంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే మీడియాలో వచ్చిన ఊహాగానాలు, రూమర్లకు చెక్ పెడుతూ.. Bro అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. పవన్ కల్యాణ్ లుక్‌తో మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పవన్ కల్యాణ్ నలుపు రంగు డ్రస్‌లో కళ్లజోడు ధరించి కనిపించారు. మోషన్ పోస్టర్‌లో కాల గమనాన్ని సూచిస్తూ.. గడియారం తిరుగుతూ కనిపించింది.
Bro బ్రో సినిమా మోషన్ పోస్టర్ చాలా ఎమోషనల్‌గా కనిపించింది. హిందు మతానికి సంబంధించిన కీర్తనలు, పురాణాల ఆధారంగా రూపొందిన భక్తి గేయాన్ని మోషన్ పోస్టర్‌కు యాడ్ చేసి అంచనాలు పెంచేశారు. తన భక్తుడి కోసం దివి నుంచి భువికి వచ్చిన దేవుడు కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నది.


Click it and Unblock the Notifications











