BRO Pre Release Event Live జీవితాంతం పవన్ కల్యాణ్‌తోనే.. చివరి శ్వాస వరకు ఆయనతో స్టెప్పులు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం BRO The Movie. తమిళంలో భారీ విజయం అందుకొన్న వినోదయ సీతమ్ సినిమా రీమేక్ చేస్తూ రూపొందించిన ఈ సినిమాలో ప్రియా ప్రకాశ్ వారియర్, కృతిశెట్టి నటించారు.

టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించిన ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా జూలై 28న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈవెంట్‌లో హైలెట్ అయిన విషయాలు... నటీనటుల స్పీచ్ వివరాల్లోకి వెళితే..

BRO Pre Release Event Live: Ganesh Master and Ali Reza others Emotional Speech

బ్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు అలి రెజా మాట్లాడుతూ.. వేదికపై మాట్లాడే అవకాశం దొరుకుతుందని అనుకోలేదు. నేను స్పీచ్ ప్రిపేర్ కాలేదు. ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి. పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్‌లో సినిమా వస్తుంది. అందులో వేషం చేయాలని చెప్పారు. అప్పటి నుంచి నాకు ఓ టెన్షన్ పట్టుకొన్నది. రేపు సినిమా పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో షూట్ ఉంటుందని చెప్పడంతో ఆ రాత్రి నిద్ర పట్టలేదు అని అన్నారు.

BRO Pre Release Event Live: Ganesh Master and Ali Reza others Emotional Speech

BRO ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కొరియోగ్రాఫర్ గణేష్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌తోనే నా జీవితం. చివరి శ్వాస వరకు ఆయన సినిమాలకు పనిచేస్తూ ఉంటాను అని అన్నారు. అలాగే మై డియర్ మార్కండేయ పాటకు స్టేజ్ మీద అలీ రెజాతో కలిసి డ్యాన్స్ చేశారు. అలీ రెజాతోపాటు సుమ కూడా స్టెప్పులు వేయడంతో స్టేజ్ దద్దరిల్లిపోయింది.

మా సినిమాల ఈవెంట్లకు వచ్చి పవన్ కల్యాణ్ ప్రమోట్ చేయడం జరిగేది. కానీ ఆయన సినిమాలోనే నేను నటించడం హ్యాపీగా ఉంది. నేను పవన్ కల్యాణ్‌తో సినిమా చేయాలని చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను. బ్రో సినిమాలో అవకాశం వచ్చింది. సాయిధరమ్ తేజ్ క్యూట్ అబ్బాయి. ఈ సినిమాలో సమాజానికి ఉపయోగపడే సందేశాన్ని అల్లరి అల్లరిగా, చిలిపిగా చెప్పాం. మీ అందరికి నచ్చుతుంది. మేము మీ మాదిరిగానే సినిమా కోసం ఎదురు చూస్తున్నాం అని నటి రేవతి అన్నారు.

టీజీ వెంకటేష్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ అభిమానులందరికీ, ఇక్కడకు వచ్చిన మిత్రులందరికి ధన్యవాదాలు. ఈ రోజు కార్యక్రమానికి వచ్చిన అందరికి అభినందనలు. దేశంలో అత్యధిక పారితోషికం తీసుకొంటున్న పవన్ కల్యాణ్.. తన అకౌంట్‌లో డబ్బు ఉంచుకోకుండా ప్రజలకు సహాయం చేస్తున్నాడు. హీరోయిన్లు కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్, తమన్‌కు ధన్యవాదాలు. ఈ సినిమా తీసిన నా కజిన్ టీజీ విశ్వ ప్రసాద్‌కు నా అభినందనలు. ఈ సినిమా విజయవంతం కావాలని విషెస్ తెలియజేస్తున్నాను అని టీజీ వెంకటేష్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X