BRO Pre Release Event బాబాయ్ మా ఫ్యామిలికి దూరమయ్యాడు.. పవన్ కల్యాణ్‌తోనే మా ఫ్యామిలీ
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం BRO The Movie. తమిళంలో భారీ విజయం అందుకొన్న వినోదయ సీతమ్ సినిమా రీమేక్ చేస్తూ రూపొందించిన ఈ సినిమాలో ప్రియా ప్రకాశ్ వారియర్, కృతిశెట్టి నటించారు. టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించిన ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా జూలై 28న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ..
బాబాయ్ రాకముందు ఏం మాట్లాడాలి అని వైష్ణవ్ తేజ్‌తో మాట్లాడుకొన్నాం. బాబాయ్ చూసిన తర్వాత మేము మాట్లాడుకొన్న విషయాలన్నీ మరిచిపోయాం. బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన అందరికి, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు థ్యాంక్స్. పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి సినిమా చేస్తున్నారంటే జెలసీ కలిగింది. ఆ తర్వాత అంతకంటే ఎక్కువ ఆనందం వేసింది అని వరుణ్ తేజ్ అన్నారు.

బాబాయ్ గురించి మాట్లాడే అవకాశం రాలేదు. చిన్నప్పటి నుంచి మాకు ఫ్రీగా వదలేశారు. కష్టపడి పనిచేయాలని చెబుతుండేవారు. ఆయన చెప్పిన విషయాలను తూచ తప్పకుండా పాటిస్తాం అని వరుణ్ తేజ్ చెప్పారు.
బాబాయ్ సినిమాలకు దూరంగా వెళ్లి రాజకీయాల్లో ఉన్నారు. మాకు దూరమై మీ కుటుంబాలకు చేరువయ్యారు. అందులో మాకు ఆనందం ఉంది. మీరు ఎప్పుడూ బాబాయ్‌కు అండగా ఉంటారని తెలుసు. మా ఫ్యామిలీ కూడా బాబాయ్‌తోనే ఉంటుంది వరుణ్ తేజ్ తెలిపారు.
తేజ్ కి ఇది మరపురాని చిత్రం అవుతుంది. నాకు ఇప్పటివరకు కళ్యాణ్ బాబాయ్ గురించి ఇలా స్టేజి మీద మాట్లాడే అవకాశం రాలేదు. మాట్లాడాలంటే వణుకొస్తోంది. కానీ బాబాయ్ గురించి కొన్ని మాటల్లో చెప్పడం కష్టం. చిన్నప్పటి నుంచి నువ్వు ఇలా చేయి, అలా చేయమని ఎప్పుడూ బలవంత పెట్టలేదు. మీరు ఎదగాలనుకున్న రంగంలోనే కష్టపడి ఎదగండి అని మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. మాకు హార్డ్ వర్క్ ఒకటే నేర్పించారు. అది బాబాయి అయినా మెగాస్టార్ చిరంజీవి గారైనా. బాబాయ్ రాజకీయంగా బయటికి వెళ్లి ఎండ, వానలో తిరుగుతున్నప్పుడు ఒక కొడుకుగా బాధ వేస్తుంది.
ఇంత కష్టపడాలా అనిపిస్తూ ఉంటుంది. కానీ మా కుటుంబం నుంచి దూరంగా ఉన్నా మీ కుటుంబాలకు దగ్గరవుతున్నారని ఆనందం మాకు ఎప్పుడూ ఉంటుంది. ఆ ఆలోచన మాకు సంతృప్తికరం అనిపిస్తూ ఉంటుంది. బాబాయ్ వెనకాల మీరు ఎప్పుడు ఉంటారని మాకు తెలుసు అదే మా నమ్మకం, అదే మా ధైర్యం. మీరే కాదు మా కుటుంబ సభ్యులలో ప్రతి ఒక్కరూ మా కళ్యాణ్ బాబాయ్ ఏం చేసినా అది సినిమాలైనా, రాజకీయాలైనా, సర్వీస్ అయినా అండగా ఉంటాం. ఫ్యామిలీ గా నేను అయినా వైష్ణవ్ తేజ్ అయినా తేజ్ అయినా, చరణన్న అయినా కళ్యాణ్ బాబాయ్ వెనకాలే ఉంటాం. ఇది ఏదో స్టేజ్ మీద చెప్పే మాట కాదు, మనసు లోపల నుంచి చెప్పే మాట అని వరుణ్ తేజ్ ఎమోషనల్ అయ్యారు.
బ్రో సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. బాబాయ్ కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలు చూశారు, ఇది కూడా హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది అని వరుణ్ తేజ్ అన్నారు.
బాబాయ్‌కు సినిమాలు చేయడం, హిట్ కావడం కొత్త కాదు.. ఎన్నో హిట్స్ అయ్యాయి. అందులో బ్రో కూడా హిట్ అవుతుంది. బ్లాక్ బస్టర్‌గా నిలుస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు అని వరుణ్ తేజ్ అన్నారు

వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీలో ఒకడిగా వచ్చాను. నేను మీలానే ఉంటాను. బాబాయ్ పవన్ కల్యాణ్ గురించి మాట్లాడే అర్హత లేదు. అంతవాడిని కాలేదు. ఈ సినిమా ఫంక్షన్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు అని వైష్ణవ్ తేజ్ అన్నారు. నా వయసు ఆయన అనుభవం అంత ఉంది. బ్రో టీమ్ అంతటికీ ఆల్ ది బెస్ట్. కచ్చితంగా సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. నన్ను ఆహ్వానించిన వారందరికీ స్పెషల్ థాంక్స్ అని అన్నారు.


Click it and Unblock the Notifications











