Pooja Hegde : పాపం పూజా హెగ్డే.. లుక్స్‌పై దారుణంగా ట్రోల్స్..
దక్షిణాది చిత్ర పరిశ్రమ దగ్గర కెరీర్ స్టార్ట్ చేసి కొన్నేళ్లల్లోనే ఊపేసిన హీరోయిన్స్‌లో డస్కీ బ్యూటీ పూజా హెగ్డే కూడా ఒకామె అని చెప్పొచ్చు. హిందీ సినిమాలు కూడా చేసింది కానీ మన తెలుగులో వచ్చిన బ్రేక్ మాత్రం ఏ ఇండస్ట్రీలో కూడా రాలేదు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కెరీర్‌ని అక్కినేని, మెగా వారసుల సరసన స్టార్ట్ చేసి టాలీవుడ్‌లో ఒక టైంకి ఈమెతో చేస్తే ప్లాప్ లో ఉన్న హీరో కూడా హిట్ కొడతాడు అనే రేంజ్ లోకి పూజా హెగ్డే క్రేజ్ మారిపోయింది.
కానీ అందరి హీరోయిన్స్ లానే తనకి కూడా బ్యాడ్ టైం వచ్చేసరికి తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈమె ఇప్పుడు ఒక్క సినిమా కూడా లేకుండా అయ్యిపోయింది. ఒక్క తెలుగు సినిమాలోనే కాకుండా తమిళ్ సహా హిందీలోనూ కొన్నాళ్ల పాటుగా పూజాకి అవకాశాలు రాలేదు. దీంతో ఈ మధ్య కొంచెం ఖాళీగానే ఉన్న పూజా హెగ్డే ఇపుడు మళ్ళీ వరుస ఆఫర్స్‌తో అది కూడా తమిళ సినిమాలో ఫుల్ బిజీగా మారింది.

అయితే ఇపుడు మళ్లీ మంచి కం బ్యాక్ ఇస్తుంది అనుకుంటే సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ కి గురయ్యింది అని చెప్పాలి. ఈమె నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అలాగే దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ నుంచి వస్తున్న గ్యాంగ్‌స్టర్ లవ్ డ్రామా "రెట్రో" కూడా ఒకటి. కాగా ఈ చిత్రం నుంచి నిన్ననే మేకర్స్ టైటిల్ టీజర్ ని వదిలారు.
ఇందులో పూజా చాలా నాచురల్ లుక్స్‌లో సూర్య సరసన కనిపించింది. కాగా ఇదే టీజర్ ఇపుడు ఆమెపై షాకింగ్ కామెంట్స్ తెచ్చి పెట్టింది. ఈమె ముఖంలో వచ్చిన చాలా మార్పులు, గత అందం కనిపించకపోవడంతో నెటిజన్స్ పూజా హెగ్డే లుక్స్‌పై దారుణంగా మాట్లాడుకుంటున్నారు. మెయిన్‌గా సూర్యతో తన ఇంటి దగ్గర గడప దగ్గర ఓ ఇల్లాలి లుక్ కనిపిస్తుంది.
పర్టిక్యులర్‌గా ఆ ఫ్రేమ్‌ని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. పూజా హెగ్డే 'తేడా' గా ఉందంటూ ఇలా కొంచెం ఘాటుగానే మాట్లాడుకుంటున్నారు. మరి చెయ్యక చెయ్యక చాలా కాలం తర్వాత ఓ సినిమాతో వస్తుంటే పూజా హెగ్డేకి మాత్రం ఇలాంటి ఫీడ్ బ్యాక్ రావడం అనేది షాకింగ్ అని చెప్పాలి. అయితే ఈ సినిమా కోసం పూజా హెగ్డే డీ గ్లామరస్ లుక్ లోకి మారినట్టుగా కనిపిస్తుంది.
డీ గ్లామరస్ లుక్స్ మన హీరోయిన్స్ కి కొత్తేమి కాదు . సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలంలో సమంత, లేటెస్ట్‌గా పుష్ప సినిమాల్లో రష్మిక మందన్నాలు కూడా ఇదే తరహా రోల్స్ చేశారు. కానీ పూజా హెగ్డే మాత్రం తన లుక్స్ మూలాన ఇలాంటి కామెంట్స్, ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పాలి. మరి దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఆమెని డీ గ్లామ్ లుక్ లో అయినా ఇంకొంచెం అందంగా చూపించాల్సింది అని ఆమె ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











