ఎన్టీఆర్ కాదు చరణే.. బుచ్చిబాబు ప్లేట్ ఫిరాయించాడా?

ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సంచలన సెట్ చేయడానికి వస్తున్న చిత్రాల్లో మన తెలుగు నుంచి కూడా కొన్ని భారీ చిత్రాలు ఉన్నాయి. కాగా ఈ చిత్రాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే దర్శకుడు బుచ్చిబాబు కలయికలు అనౌన్స్ చేసిన పెద్ది సినిమా కూడా ఒకటి. దీనికి ముందు రామ్ చరణ్ నుంచి గేమ్ చేంజర్ అనే భారీ వైఫల్యం ఉన్నప్పటికీ దీనిపై మాత్రం అనేక అంచనాలు నెలకొన్నాయి.

కాగా ఈ సినిమా మొదలైనప్పటి నుంచి కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి అసలు సినిమా రామ్ చరణ్ కి సెట్ చేసిన సినిమా కాదని దీనికి ముందు ఈ చిత్రాన్ని మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కోసం సెట్ చేసిన కథ అని బుచ్చిబాబు ముందు ఎన్టీఆర్ కోసమే సబ్జెక్టు రెడీ చేసుకుంటే తర్వాత రామ్ చరణ్ వద్దకు వచ్చిందని పలు పుకార్లు వినిపించాయి.

Buchibabu breaks silence on ntr first choice for peddi over ram charan

అయితే దీనితో చాలామంది ఎన్టీఆర్ అభిమానులు కూడా తమ సినిమాని రామ్ చరణ్ చేస్తున్నాడు అంటూ ప్రచారం చేసుకున్నారు కానీ దీనిపై అసలు విషయాన్నీ బుచ్చిబాబు లేటెస్ట్ గా రివిల్ చేసినట్టు తెలుస్తుంది. కాగా బుచ్చిబాబు దర్శకుడు సుకుమార్ శిష్యుడైన అందరికీ తెలిసిందే. అయితే తాను చేసిన సినిమాలోని మన తెలుగు నేలకు చెందిన మూలాలపై తెరకెక్కించడం ఇష్టమని అలానే పెద్ద సినిమా కూడా రాసుకున్నప్పుడు తాను ఈ సినిమా కోసం సుకుమార్ గారికి చెబితే సుకుమార్ తనకి ఈ సినిమాని రామ్ చరణ్ తో చేస్తే బాగుంటుందని చెప్పారట.

సో సినిమా మొదట రామ్ చరణ్ కి సెట్ చేసిన సినిమా అని చెప్పవచ్చు. మొత్తానికి ఈ సస్పెన్స్ కి బుచ్చిబాబు ఒక శుభం కార్డుని వేసేసాడు అని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్వింగ్ లో కంప్లీట్ అవుతుండగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నారు. ఇక ఆల్రెడీ రీసెంట్ గా వచ్చిన టీజర్ గేమ్స్ ఇండియా లెవెల్ లో మంచి అటెన్షన్ కూడా అందుకుంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హాట్ బ్యూటీ జాన్వి కపూర్ నటిస్తుండగా కన్నడ నటుడు శివ రాజ్ కుమార్ పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు.

అలాగే తనతో పాటుగా బాలీవుడ్ నటుడు మీర్జాపూర్ సిరీస్ ఫ్రేమ్ దివ్యాంధు శర్మ కూడా నటిస్తున్నాడు ఇక ఈ సినిమాకి సంచలన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తుండగా కొత్త నిర్మాణ సంస్థ వృద్ధి సినిమా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు.

అలాగే వచ్చే ఏడాది ఈ చిత్రం మార్చే 27 రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ విషయానికొస్తే ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీతో భారీ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ అవుతుండగా ఎన్టీఆర్ కూడా షూటింగ్లో జాయిన్ కాబోతున్నాడు ఈ చిత్రాన్ని వీరు వచ్చే ఏడాది సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: ram charan ntr buchibabu sana
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X