Kalki 2898 AD: కల్కి 2898 AD పార్ట్ 2 టైటిల్‌ను మార్చేసిన నాగ్ అశ్విన్.. కొత్త టైటిల్ ఏమిటో తెలుసా?

చాలా కాలంగా పాన్ ఇండియా మార్కెట్ లో మన తెలుగు సినిమాల రాక తగ్గింది. మన హీరోలు రెండేళ్లు మూడేళ్ళకి ఒకో సినిమా చేస్తుంటే పాన్ ఇండియా బాక్సాఫీస్ ఒకోసారి సరైన సినిమాలు లేక వెలవెలబోతుంది. ఇలాంటి సమయంలోనే ఈ ఏడాది వచ్చిన భారీ చిత్రమే "కల్కి 2898 ఎడి". మన తెలుగు ఆడియెన్స్ కి ఒక సరికొత్త అనుభూతిని అలాగే ఊహించని లెవెల్ విజువల్ ట్రీట్ ని అయితే రెబల్ స్టార్ ప్రభాస్ అలాగే దర్శకుడు నాగ్ అశ్విన్ లు అందించారు.

కాగా ఈ సినిమా తోనే ఒక సరికొత్త సినిమాటిక్ యూనివర్స్ ని కూడా మేకర్స్ మనకి పరిచయం చేసి హాలీవుడ్ లెవెల్ సూపర్ హీరోస్ తరహా ఫ్రాంచైజ్ ని ముందు రోజుల్లో అందిస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు. అయితే ఈ భారీ సినిమాకి సీక్వెల్ కల్కి 2898 ఎడి పార్ట్ 2 ని అనౌన్స్ చేయగా గత కొన్ని రోజులు నుంచి ఈ సినిమా విషయంలో పలు ఆసక్తికర విషయాలే వినిపిస్తున్నాయి.

bujji trashes kalki 2898 ad part 2 title and other leaks

కాగా ఈసారి పార్ట్ 2 కథ అంతా వేరే లెవల్లో ఊహించని విధంగా ఉంటుందట. పార్ట్ 1 లో దర్శకుడు నాగ్ అశ్విన్ ఎక్స్ట్రీమ్ ఫ్యూచర్ లోనే ఎక్కువ కథని నడిపించిన సంగతి తెలిసిందే. కేవలం సినిమా మొదలు, అంతంలో మాత్రమే మహాభారతం సన్నివేశాలు చూపించాడు. కానీ ఈసారి పార్ట్ 2లో ఎక్కువ శాతం మహాభారతం మీదే ఉంటుందట. అలాగే పార్ట్ 1 క్లైమాక్స్ లో కర్ణుడిగా ప్రభాస్ ని రివీల్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ ఒక్క సీన్ కూడా లేకపోతే సినిమా ప్రభాస్ తేలిపోయినట్టే అని చాలా కామెంట్స్ వినిపించాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని దర్శకుడు నాగశ్విన్ ప్రభాస్ రోల్ విషయంలో బిగ్ ఛేంజ్ నే చేసాడట. పార్ట్ 2 మొత్తం కర్ణుడిపై నడిచే కథలా కనిపించేలా ప్రభాస్ పైనే ఎక్కువ ఫోకస్ ఉండే సన్నివేశాలని మాత్రమే తాను డిజైన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇందులో భాగంగానే పార్ట్ టైటిల్ ని కూడా కల్కి అని కాకుండా కర్ణ అనే పేరు వచ్చేలా పెడుతున్నారట. అలాగే పార్ట్ 1 అంతా ఫ్యూచర్ లో ఉంటుంది కాబట్టి కల్కి 2898 ఎడి అని పెట్టారు. కానీ పార్ట్ 2 గతం కాబట్టి కర్ణ బిసి అన్నట్టుగా ఒక ఏడాది నెంబర్ లో వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. ఇలా ఈ క్రేజీ కాంబినేషన్ లో పార్ట్ 2 కథ ఊహించని లెవెల్లో ఉండబోతుంది అని సినీ వర్గాలు చెబుతున్నాయి.

bujji trashes kalki 2898 ad part 2 title and other leaks

అలాగే పార్ట్ 2 లో ఉలగనయగన్ కమల్ హాసన్ పాత్ర గతంలో కూడా అంటే మహాభారతం సమయంలో కూడా ఉంటుంది అన్నట్టుగా పుకార్లు వినిపిస్తున్నాయి. అక్కడ ప్రభాస్ వర్సెస్ కమల్ హాసన్ పై భారీ పోరాట సన్నివేశాలు ఉంటాయట. ఇలా ఓవరాల్ గా అయితే కల్కి పార్ట్ 2 అనేది మాత్రం విధంగా ఉండబోతుంది అని మాత్రం చెప్పవచ్చు. అయితే ఈ వార్తలపై అసలు ట్విస్ట్ ఇక్కడే వచ్చింది.

మేకర్స్ ఈ సినిమాలో బుజ్జి ఏఐ రోబోట్ ని ఎంత హైప్ చేసారో తెలిసిందే. కాగా ఈ న్యూస్ పై సోషల్ మీడియాలో ఈ బుజ్జి స్పందించింది. సినిమాలో రామ్ గోపాల్ వర్మ చెప్పే డైలాగ్ నువ్ 100 పర్సెంట్ అబద్దం చెబుతున్నావని నాకు 101 పర్సెంట్ తెలుసు అన్నట్టు డైలాగ్స్ గా గత కొన్ని రోజులు నుంచి సర్క్యులేట్ అవుతున్న వార్తలని నిజం కాదని కొట్టి పారేసింది. సో ఇది కూడా ఒక ఊహించని ట్విస్ట్ అనే చెప్పి తీరాలి. అలాగే ఈ క్రేజీ ప్రాజెక్ట్ వచ్చే ఏడాదిలో షూటింగ్ మొదలు పెట్టుకోనుండగా 2028లో రిలీజ్ కి వచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X