మరదలి నిశ్చితార్థంలో హడావిడి అంతా బన్నీదే ...!
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిశ్చితార్ధ వేడుక అంగరంగవైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అమ్మాయి, అబ్బాయి డిజైనర్ దుస్తుల్లో దివి నుంచి భువికి దిగివచ్చిన అందాల జంటలాగా కనువిందు చేశారు. కానీ, వీరిని డామినేట్ చేస్తూ మరో జంట లైమ్ లైట్ ను మొత్తం దోచేసుకుందట. వారవరో కాదు అల్లు వారి అబ్బాయి, పెళ్లికూతురు బావ బన్నీనే అట.
సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప సినిమా కోసం బాడీని మంచి షేపులోకి తీసుకువచ్చిన అల్లు అర్జున్, నిహారిక నిశ్చితార్ధ వేడుకకు ప్రముఖ బాలీవుడ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన బ్లాక్ అండ్ బ్లాక్ ఔట్ ఫిట్ లో వేడుకకు హాజరయ్యాడు. ఇక బన్నీ బాబు వేదిక వద్దకు వస్తూనే కెమెరాలు అన్నీ ఒకేసారి క్లిక్కు మన్నాయి అంటే, మనోడు ఏ రేంజ్ లో మైమరపించాడో అర్ధం చేసుకోవచ్చు.

ఇక బన్నీకి కాంప్లిమెంటింగ్ గా స్నేహ కూడా మనీష్ మల్హోత్రా రూపొందించిన గ్లిట్టర్ పేస్టెల్ డ్రెస్ వేసుకుని మిల మిలా మెరిసిపోయిందనే చెప్పాలి. ఇక నిశ్చితార్థ వేడుకకు వచ్చిన వారందరి కళ్లు బన్నీ జంట మీదే ఉన్నాయి అనడంలో అతిశయోక్తే లేదు. అంతగా అందరిని మెస్మరైజ్ చేశారు. ఇక ఈ ఒక్క ఔటింగ్ తోనే ఈ జంటకు టిన్సెల్ టౌన్ లోనే స్టైలిష్ జంట అనే బిరుదు ఇచ్చేశారు అభిమానులు. మరి నిశ్చితార్థానికే ఈ రేంజ్ లో ఉంటే, బన్నీ జంట పెళ్లికి ఇంకెంత హడావిడి చేస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











