twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Google CEOకి బన్నీ వాసు లేఖ.. ఆ సైకో తప్పా ? మీ తప్పా? ఆలోచించండి!

    |

    గత కొద్దిరోజులుగా బన్నీ వాసు వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తనను లైంగికంగా వాడుకుని అబార్షన్ కూడా చేయించాడని సునీత అనే ఒక వర్ధమాన నటి ఆరోపిస్తోంది. అయితే ఆమె గతంలో కూడా కత్తి మహేష్ మీద కూడా ఇలాంటి ఆరోపణలు చేసి ఉండడంతో పాటు ఆమె మానసిక స్థితి బాలేదని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ అంశం మీద తాజాగా ఆయన ఏకంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కి లేఖ రాశారు. ఆ వివరాల్లోకి వెళితే

     గూగుల్ సీఈఓకి లేఖ

    గూగుల్ సీఈఓకి లేఖ

    గౌరవనీయులైన సుందర్ పిచ్చయ్ గారికి, అంటూ మొదలు పెట్టిన ఆయన మీరు ఇంటర్నెట్ స్వేచ్ఛ మీద ప్రచురించిన అభిప్రాయాన్ని నేను చదవడం జరిగిందని, గూగుల్ లాంటి అంతర్జాతీయ కంపెనీకి సీఈఓ అయిన మీరు ఎంతో ఆలోచనతో ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఉంటారు అని నా నమ్మకం. ఈ విషయం మీద నా స్వీయానుభవం ఒకటి మీతో పంచుకోవటం కోసం ఈ ఉత్తరం రాస్తున్నానని అన్నారు. సామజిక మాధ్యమాలు ఉపయోగించటం మొదలుపెట్టిన రోజుల్లో నేను కూడా నా ఆలోచనా విధానాలు, భావాలూ పంచుకోడానికి ఇది మంచి వేదిక అని నమ్మానని అన్నారు.

    నేను పడ్డ క్షోభ

    నేను పడ్డ క్షోభ

    అలాగే భావ ప్రకటనా స్వేచ్ఛకి, ఇంటర్నెట్ స్వేచ్ఛకు అవధులు ఉండకూడదని కచ్చితంగా అనుకున్నాను. ఈ నమ్మకంతోనే సామాజిక మాధ్యమాలను ఆనందంగా ఉపయోగించానని అన్నారు. కానీ గత రెండు సంవత్సరాలుగా బాధ్యతలేని భావ ప్రకటనా స్వేచ్ఛ, ఇంటర్నెట్ స్వేచ్ఛ వలన మానసికంగా నేను పడ్డ క్షోభను మీలాంటి వారికి చెప్పడం వలన సామాజిక మాధ్యమాలలో భావ ప్రకటనా స్వేచ్ఛ, ఇంటర్నెట్ స్వేచ్ఛ మీద మీ ఆలోచన విధానంలో అభ్యుదయ మార్పు వస్తుందని నా నమ్మకం అని రాసుకొచ్చారు.

    జగమెరిగిన సత్యం

    ఇది ప్రభుత్వాలకో లేదా రాజ్యాలకో లేదా సమాజానికో సంబంధించిన విషయం అయితే వేరు కానీ, ఈ ఇంటర్నెట్ ఫ్రీడం చాటున ఉన్న సామాజిక మాధ్యమాల్లో ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితానికీ, తన కుటుంబ పరువుకు సంబంధించిన విషయం అయితే, ఆ వ్యక్తికీ తన కుటుంబానికి జరిగే నష్టం నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు . పైగా ఆ పరువు ఎంతమంది దగ్గర పోయిందో కూడా చక్కటి లెక్కలతో సహా చెబుతారు ఈ వేదిక నిర్వహించే కంపెనీలు అని పేర్కొన్నారు. విచక్షణ లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న వాళ్ళని కట్టడి చేయటానికి సమర్థవంతమైన విధానాలు ఉన్నాయా అంటే మీ దగ్గర సమాధానం ఉండదు అనేది జగమెరిగిన సత్యం అని అన్నారు.

    నేను, నా కూతురు

    నేను, నా కూతురు

    ఇదే కోవలో ఒక విచక్షణ లేని వ్యక్తి వలన ఇబ్బంది పడుతున్న నేను, నా కూతురు, దాని వల్ల నా కుటుంబానికి కలిగిన బాధ చూసిన వాడిగా ఈ ఉత్తరం రాస్తున్నానని ఆయన అన్నారు. అబద్ధాలను అసత్యాలను పోస్టులు, వీడియోల రూపంలో పెట్టి ప్రజలను ఇబ్బంది పెడుతున్న వాళ్ళది తప్పా ? అలాంటి వాళ్ళు చేస్తున్న క్రూరమైన పనులు నియంత్రించకుండా ప్రపంచం ముందు పెడుతున్న సామాజిక మాధ్యమాలది తప్పా? అని అడిగితే సామాజిక మాధ్యమాల ద్వారా కేవలం ఒక వేదిక అందించటం మాత్రమే మేము చేస్తున్నది అని ఈ వేదికలు తపించుకోవచ్చని అన్నారు,

    తల ప్రాణం తోకకు వచ్చింది

    తల ప్రాణం తోకకు వచ్చింది

    ఎంత మంది అమ్మాయిల నగ్న చిత్రాలు ఇంటర్నెట్లో వాళ్ళ ప్రమేయం లేకుండా అప్ లోడ్ చేయబడి వాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నాయో రోజూ చూస్తూనే ఉన్నాము. ఎంతోమంది ఆరాచకులు వాళ్ళ వాంఛలు తీర్చకపోతే మార్ఫింగ్ చేసిన ఫోటోలు సామాజిక మాధ్యమాలలో ప్రచురిస్తాం అని బ్లాక్ మెయిల్ చేసి లొంగదీసుకున్న తరుణాలు కోకొల్లలు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో కొంత పలుకుబడి ఉన్న నేను, నా కూతురిని చంపుతానని ఒక మానసిక స్థిమితం లేని సైకో ఒక సామాజిక మాద్యమంలో వీడియో పెడితే, అది తీయించటానికి నా తల ప్రాణం తోకకు వచ్చిందని అన్నారు.

    Recommended Video

    Bunny Vas Clarifies On Junior Artist Sunitha Boya Issue ||
    సామాన్యుల పరిస్థితి ఎంత

    సామాన్యుల పరిస్థితి ఎంత


    నాలాంటి వాడికే ఇంత కష్టం అయితే ఇంకా సామాన్యుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో ఊహించవచ్చు. ఇది చదివిన వెంటనే మీ మదిలోకి వచ్చే ఆలోచన "మరి ఇలాంటివి జరిగినపుడు, సామాజిక మాధ్యమాలలో ఉండే కంప్లైంట్ సెల్లో ఫిర్యాదు చేయచ్చు కదా?", కానీ నేను సామాజిక మాధ్యమాల కంప్లైంట్ సెల్లో ఇచ్చినన్ని ఫిర్యాదులు పోలీసులకు కూడా ఇవ్వలేదు. కానీ నేను తెలుసుకున్నది ఏమిటంటే ఒకరు ప్రచురించిన పోస్ట్ లేదా న్యూస్ అబద్ధం అని నిరూపించటం సామాజిక మాధ్యమాలలో కన్నా ఇండియన్ కోర్టులోనే చాలా సులువు. అందుకే కోర్టును ఆశ్రయించి న్యాయం కోసం పోరాడుతున్నానని అన్నారు.

    ఇది వినోదంలా

    ఇది వినోదంలా

    ఇక ఈ ఉత్తరం చాలా మందికి వెటకారం కావచ్చు, కానీ త కుటుంబంలో స్త్రీలకో, పిల్లలకో ఇలాంటి పరిస్థితి వస్తే కానీ నా ఈ బాధ అర్థం కాదు. అలాంటి బాధను చూసిన వాళ్లకు ఈ ఉత్తరం అర్థం అవుతుంది, కానీ సోషల్ ప్లాట్ ఫారం అనే నడి వీధిలో నిలబడి వేదిక చూసిన వాళ్ళకి ఇది వినోదంలా కనిపిస్తుంది అంటూ ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు.

    English summary
    Few days ago, the Jr Artist Sunitha Boya made a sensational allegation against the producer Bunny Vasu who is popular for his production venture Geetha Govindam in which Vijay Deverakonda and Rashmika Mandanna played the lead roles. Sunitha Boya alleged that Bunny Vasu had exploited her by promising her offers in the movies. now bunny vas wrote a long letter to Google CEO.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X