క్షణక్షణం గొప్ప కాన్సెప్ట్ మూవీ.. సినిమా నచ్చడం వల్లే రిలీజ్ చేస్తున్నాం.. నిర్మాత బన్నీ వాసు

మన మూవీస్ బ్యానర్‌లో ఉదయ్ శంకర్, జియా శర్మ హీరో, హీరోయిన్లుగా కార్తీక్ మేడికొండ దర్శకత్వంలో రూపొందిన డార్క్ కామెడీ చిత్రం క్షణ క్షణం. ఈ చిత్రాన్ని గీతా ఫిలింస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఫిబ్రవరి 26వ తేదీన విడుదలకు సిద్దం అవుతున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన కార్యక్రమంలో చిత్ర యూనిట్ ట్రైలర్ రిలీజ్ చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లక్కీ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ మాట్లాడుతూ...

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేస్తున్నప్పుడు కొన్ని లెక్కలు వేసుకుని చేస్తాం. కానీ ప్రయోగాత్మక చిత్రాలు నిర్మించేందుకు ధైర్యం కావాలి. ఇటీవల చావు కబురు చల్లగా సినిమా చేస్తున్నప్పుడు అలాంటి ఫీలింగ్‌ను అనుభవించాను. అలాంటి ధైర్యం చేసి క్షణక్షణం చిత్రాన్ని రూపొందించిన వర్ల, మన్నం చంద్రమౌళిని అభినందిస్తున్నాను. ఈ సినిమా చూశాను. చాలా బాగుంది. సినిమా నచ్చడంతో గీతా ఫిలింస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా రిలీజ్ చేస్తున్నాం. విభిన్న చిత్రాలు వస్తే కొత్తగా నటీనటులు, దర్శకులు ఇండస్ట్రీలోకి వస్తారు. నాకు సినిమా అంటే చచ్చేంత ప్రాణం. అందుకే ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నాను అని బన్నీ వాసు అన్నారు.

Bunny Vasu about release of Kshana Kshanam movie trailer

హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ మమ్మల్ని మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్న బన్నీ వాసుకు చాలా థ్యాంక్స్. సినిమా నచ్చి ఆయన తనే డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ముందుకొచ్చారు. గీతా ఫిలింస్ లో మా సినిమా రిలీజ్ కావడం గౌరవంగా భావిస్తున్నా. బన్నీ వాస్ గారు మాకు మాకు చాలా సలహాలు, సూచనలు ఇచ్చారు. క్షణక్షణం లాంటి మంచి సినిమాను నాకు ఇచ్చిన దర్శకుడు కార్తీక్ కు థ్యాంక్స్. సంగీత దర్శకుడు కోటి గారు ఓ మంచి క్యారెక్టర్ చేశారు. ఆయనతో నటించడం సంతోషంగా ఉంది. అన్నారు.

Bunny Vasu about release of Kshana Kshanam movie trailer

దర్శకుడు కార్తిక్ మేడికొండ మాట్లాడుతూ.. క్షణక్షణం సినిమాకు బన్నీవాసు అందించిన సపోర్ట్ మర్చిపోలేం. తమన్నా భాటియాకు కూడా థ్యాంక్స్, ట్విట్టర్ ద్వారా మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. క్షణక్షణంలో కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది. రఘు కుంచె క్యారెక్టర్ అందర్నీ ఆకట్టుకొంటుంది.

నిర్మాత డాక్టర్ వర్లు మాట్లాడుతూ... వాల్ట్ డిస్నీకి సినిమాలే ప్రపంచం. ఆయన సంపాదన అంతా సినిమా మేకింగ్ మీద పెట్టేవాడు. అంత ప్యాషన్ సినిమాలు అంటే. అదే తపనను ఉదయ్‌లో చూశాను. వాళ్ల నాన్న నాకు ఫ్రెండ్. మెడిసిన్ చదవమంటే సినిమాలపై ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు. తను కోరుకున్న రంగంలో ముందుకు వెళ్లమని ఉదయ్‌కు చెబుతున్నా. దర్శకుడు కార్తీక్ తనకు తెలియకుండానే ఒక సూపర్ హిట్ సినిమా ఫార్ములాను క్షణక్షణం కథలో వాడాడు. కొత్తగా ఆకట్టుకునేలా సినిమా ఉంటుంది. అన్నారు.

నటీనటులు: ఉదయ్ శంకర్, జియాశర్మ, శ్రుతిసింగ్, మ్యూజిక్ దర్శకుడు కోటి, రఘు కుంచె, రవి ప్రకాశ్, గిఫ్టన్ తదితరులు
డివోపి: కె సిద్దార్ద్‌రెడ్డి
మ్యూజిక్ : రోషన్ సాలూర్
ఎడిటర్: గోవింద్ దిట్టకవి
పిఆర్వో: జియస్‌కే మీడియా
నిర్మాతలు: డాక్టర్ వర్లు, మన్నం చంద్ర మౌళి
దర్శకుడు : మేడికోండ కార్తిక్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X