మెగా బ్రదర్స్‌తో దేవరకొండ బ్రదర్స్‌ను పోల్చిన నిర్మాత.. చాలా అరుదంటూ కామెంట్స్
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా బేబి (Baby). 2017లో అర్జున్ రెడ్డి, 2018 ఆర్ఎక్స్ 100 చిత్రాలు ఎలాగే 2023లో బేబి సినిమా అలాగా అని ప్రేక్షకులు ఫుల్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. జూలై 14న విడుదలైన ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తోంది.
ఫలితంగా వసూళ్ల పరంపర కొనసాగిస్తోంది. ఇటీవలే ఈ సినిమా సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది. అయితే విజయ్, ఆనంద్ దేవరకొండ బ్రదర్స్ ను మెగా బ్రదర్స్ తో పోలుస్తూ నిర్మాత బన్నీ వాసు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు అవి వైరల్ గా మారాయి.

రౌడీ హీరో తమ్ముడిగా: సినీ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. గీత గోవిందం, అర్జున్ రెడ్డి వంటి చిత్రాలతో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. అలాగే అతని తమ్ముడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు ఆనంద్ దేవరకొండ. దొరసాని సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ తనదైన శైలీలో మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు.

నటీనటులు: ఇటీవల ఆనంద్ మెయిన్ రోల్ చేసిన సినిమా బేబీ. ఈ సినిమాలో వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కూడా కీలక పాత్రలు పోషించారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంతో వచ్చిన బేబి సినిమాకు హృదయ కాలేయం, కొబ్బరి మట్ట సినిమాల దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు.
కలెక్షన్స్: బేబీ సినిమాను డైరెక్టర్ మారుతీ, ఎస్‍కేఎన్ (శ్రీనివాస కుమార్) సంయుక్తంగా మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మించారు. జూలై 14న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఐదు రోజుల్లోనే రూ. 18 కోట్ల షేర్, రూ. 34 కోట్లకుపైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. దీంతో ఇటీవల బేబి సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది. అయితే తాజాగా మెగా బ్రదర్స్ పై నిర్మాత బన్ని వాసు షాకింగ్ కామెంట్స్ చేశారు.

అదే రికార్డ్: "మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తర్వాత బ్లాక్ బస్టర్స్ అందించిన ఇద్దరు స్టార్ బ్రదర్స్ దేవరకొండలు మాత్రమే. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకే కుటుంబంలో ఇద్దరు స్టార్లు ఉండటం చాలా అరుదు. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి వంటి, ఆనంద్ దేవరకొండ బేబి సినిమా వంటి కల్ట్ బ్లాక్ బస్టర్స్ అందించారు. మెగా బ్రదర్స్ తర్వాత దేవరకొండ బ్రదర్స్ దే రికార్డ్" అని ప్రొడ్యూసర్ బన్నీ వాసు తెలిపారు.

పోలిక ఏంటీ?: బేబి సినిమాతో ఇంత భారీ హిట్ ఇచ్చినందుకు దేవరకొండ సోదరుల అభిమానులు ఎంతగానో థ్రిల్ అయ్యారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని బన్ని వాసు అన్నారు. ఆయన కామెంట్స్ నెట్టింట్లో వైరల్ కాగా.. మెగా బ్రదర్స్ తో పోలిక ఏంటి అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కానీ, దేవరకొండ అభిమానులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











