హీరో సూర్య గోడలు దూకి పారిపోయాడు.. టాలీవుడ్ ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్
సూర్య శివకుమార్. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తమిళ ఇండస్ట్రీని రజనీకాంత్, విజయ్, కమల్ హాసన్, విక్రమ్ తదితర స్టార్స్ దున్నేస్తున్న సమయంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించారు సూర్య. లవర్ బాయ్‌గా, యాక్షన్ హీరోగా తన విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తమిళనాడుతో పాటు డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు సూర్య. ఆయన నటించిన సినిమాలు తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అవుతాయి. అలా తెలుగులోనూ సూర్యకు మార్కెట్ ఏర్పడింది. అలాంటి సూర్యపై టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ వివరాల్లోకి వెళితే...
డిసెంబర్ 12న అన్నగారు వస్తారు
సూర్య తమ్ముడు కార్తీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ వా వాతియర్ తెలుగులో అన్నగారు వస్తారు. డిసెంబర్ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కార్తీ సరసన కృతిశెట్టి హీరోయిన్‌గా నటించారు. సత్యరాజ్, రాజ్ కిరణ్, నిలగళ్ రవి, ఆనంద్ రాజ్, శిల్పా మంజునాథ్, కరుణాకరన్‌లు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జార్జ్ సి విలమ్సన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. వెట్రే కృష్ణన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించగా.. సంతోష్ నారాయణన్ సంగీత దర్శకత్వం వహించారు.

అన్నగారు వస్తారు ప్రీ రిలీజ్ ఈవెంట్
రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలు వేగవంతం చేసింది. ఇటీవల రిలీజైన అన్నగారు వస్తారు ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా మంగళవారం హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం జరిగింది. హీరో సందీప్ కిషన్, దర్శకులు దేవ కట్టా, బాబీ తదితరులు చీఫ్ గెస్టులుగా వచ్చారు. ఈ సందర్భంగా మెగా ప్రొడ్యూసర్ బన్నీవాసు మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.
మీ ఫ్యామిలీతో క్లోజ్ రిలేషన్
కార్తీ గారంటే ఎంతో అభిమానం. ఇక్కడున్న డైరెక్టర్స్ అంతా కూడా కనెక్ట్ అయితే తప్పించి ఈ కార్యక్రమానికి రారు. ఈ జనరేషన్ హీరోలందరికీ మీరంటే ఎంతో ఇష్టం. మీ తొలి సినిమాకు నేను, జ్ఞాన్‌వేల్ రాజా వచ్చి రషెస్ చూశాం. ఆ సినిమాలోని మీ సాంగ్‌కి థియేటర్ ఎలా ఊగిందంటే అదొక సూపర్ ఎక్స్‌పీరియన్స్. ఒక తమిళ చిత్రం, తమిళ మాస్ సాంగ్‌కి ఒక కొత్త హీరో వచ్చినప్పుడు థియేటర్ షేక్ అవ్వగం మామూలు విషయం కాదు. ఇప్పటికీ నా కళ్ల ముందు అది కనిపిస్తూనే ఉంది. మీ ఫ్యామిలీతో నాకు మొదటి నుంచి చాలా మంచి రిలేషన్ ఉంది అని బన్నీ వాసు చెప్పారు.
నేనూ, సూర్య గోడలు దూకేశాం
సూర్య గారు నేను ఒకసారి రాజమండ్రిలో ఒక ఫంక్షన్‌కి వెళితే.. అక్కడ జనం చుట్టుముడితే మేమిద్దరం గోడలు కూడా దూకాం అంత మంచి రిలేషన్ ఉంది. విడిగా కలిసినప్పుడు కూడా చాలా బాగా మాట్లాడుకుంటాం. మీతో నాకు రిలేషన్ తక్కువ కానీ మీ చుట్టూ ఉన్న సర్కిల్ .. ప్రభు, రాజశేఖర్ గారు నాకు ఆత్మీయులు. స్టూడియో గ్రీన్‌తో నాకు చాలా మంచి రిలేషన్ ఉంది. తొలిరోజు నుంచి నేను, జ్ఞాన్‌వేల్ రాజా ఫ్రెండ్స్. మీ తెలుగు చాలా క్యూట్‌గా ఉంటుంది. ఊపిరి సినిమాలో మీరు పెయింట్ వేసే సీన్ నా ఫేవరేట్. మా ఇంట్లో ఎప్పుపడూ రిపీట్ అవుతుంటుంది. మంచి సినిమాలు తీస్తూ.. కొత్త దర్శకుల్ని ఎంకరేజ్ చేస్తుంటారు. మీరు పరిచయం చేసిన దర్శకులు చాలా పెద్ద స్థాయికి చేరుకున్నారు. ఈ సినిమా కూడా ఇక్కడ మంచిగా ఆడాలి అని కోరుకుంటున్నా. కార్యక్రమానికి పిలిచిన జ్ఞాన్‌వేల్ రాజాకి థ్యాంక్స్. కృతిశెట్టి మా ఉప్పెన బ్యూటీ. మీకు కూడా మంచి హిట్ రావాలని కోరుకుంటున్నానని బన్నీ వాసు వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











