రాజమౌళికి అతడి మాటల సాయం.. త్వరలోనే ఎన్టీఆర్, చరణ్ మల్టీస్టారర్!
దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి లాంటి భారీ చిత్రం తరువాత రాంచరణ్, ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేయబోతోంది. బాహుబలిని మించేలా ఈ చిత్రం 300 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కబోతోంది. రాజమౌళి త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకుని వెళ్లాలని భావిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబందించిన సెట్ వర్క్ ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో, రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది.
ఈ సారి రాజమౌళి బ్రిటిష్ కాలానికి చెందిన కథతో రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బ్రిటిష్ నేపథ్యంలో సాగే కథ కావడంతో మాటలు పదునుగా ఉండాలి. దీని కోసం ఈ చిత్ర మాటల రచయితగా బుర్రా సాయిమాధవ్ ని ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రం గురించి అనేక ఊహాగానాలు వస్తున్నప్పటికీ చిత్ర యూనిట్ మాత్రం సైలెంట్ మైంటైన్ చేస్తోంది. వచ్చే నెలలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ అరవింద సమేత చిత్రంలో, రాంచరణ్ బోయపాటి చిత్రంతో బిజీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











