ముమైత్ ఖాన్ మోసం చేసింది.. మరొకరికి ఇలా జరగకూడదని ఈ నిజాన్ని బయటపెడుతున్నా

ఐటెమ్ సాంగ్స్ తో ఒకప్పుడు టాలీవుడ్ లో మంచి క్రేజ్ అందుకున్న ముమైత్ చాలా రోజుల తరువాత వార్తల్లో నిలిచింది. ఆమె మోసం చేసిందని ఒక క్యాబ్ డ్రైవర్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడానికి సిద్ధమవుతున్నాడు. అలాగే ఆమెతో ఉన్న ఫొటోలను కూడా మీడియా ముందు ఉంచాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరొక వ్యక్తికి ఇలా జరగకూడదు అనే బాధతోనే ఇలా చేయాల్సి వస్తోందని ఆ వ్యక్తి చెబుతున్నాడు.

చివరగా ఆ సినిమాలో..

చివరగా ఆ సినిమాలో..

తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లోని అనేక సినిమాల్లో స్పెషల్ ఐటెమ్ సాంగ్స్ తో మెప్పించిన ముమైత్ ఖాన్ గత కొంత కాలంగా సినిమాలకు దూరంగానే ఉంటోంది. ఆమెకు అవకాశాలు కూడా చాలా వరకు తగ్గాయనే చెప్పాలి. చివరగా తిక్క సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో అలా కనిపించి వెళ్లిపోయింది. ఇక 2017లో బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కనిపించిన విషయం తెలిసిందే.

 డబ్బులు ఇవ్వకుండా చీటింగ్..

డబ్బులు ఇవ్వకుండా చీటింగ్..

అయితే రీసెంట్ గా హైదరాబాద్ కు చెందిన ఒక క్యాబ్ డ్రైవర్ రాజు ఆమె మోసం చేసిందని ఆరోపణలు చేశారు. 8 రోజుల వరకు ట్రిప్ కి తీసుకెళ్లి డబ్బులు ఇవ్వకుండా చీట్ చేసిందని చెబుతున్నాడు. ముందుగా ఈ విషయాన్ని క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్ కు పిర్యాదు చేసినట్లు చెబుతూ చర్చల అనంతరం పోలీస్ స్టేషన్ కి వెళతానని తెలిపాడు.

టోల్ గేట్ డబ్బులు కూడా ఇవ్వలేదు

టోల్ గేట్ డబ్బులు కూడా ఇవ్వలేదు

మూడు రోజుల వరకు గోవా ట్రిప్ కోసం కారును బుక్ చేసుకున్న ముమైత్ ఖాన్ ఆ తరువాత 8రోజుల వరకు కారును వదలలేదని గోవా మొత్తం తిరిగినట్లు రాజు ఆరోపించారు. అయితే ఈ ప్రయాణంలో ఆమె కనీసం టోల్ గేట్ డబ్బులు కూడా ఇవ్వలేదని మొత్తంగా రూ.15వేల వరకు చెల్లించాలని రాజు చెబుతున్నాడు. మరొక వ్యక్తి మోసపోకూడదు అనే బాధతోనే ఇలా చేయవలసి వస్తోందని అతను మీడియాకు తెలిపారు.

Recommended Video

RDX Love Trailer | పాయల్ రాజ్‌పుత్ కేక
 గతంలో మాదిరిగా బిజీగా కనిపించడం లేదు

గతంలో మాదిరిగా బిజీగా కనిపించడం లేదు

2004లో స్వామి సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ముమైత్ ఖాన్ ఆ తరువాత ఛత్రపతి, పోకిరి వంటి సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ చేసి తన క్రేజ్ ని మరింత పెంచుకుంది. ఇక కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో కూడా నటించింది. ఎక్కువగా పూరి జగన్నాథ్ సినిమాల్లో ఆమె స్పెషల్ సాంగ్స్ లలో కనిపించేది. కానీ ముమైత్ గతంలో మాదిరిగా బిజీగా కనిపించడం లేదు. ఇక చాలా రోజుల తరువాత ముమైత్ పేరు ఇలా ఒక వివాదంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X