వెంకటేష్ కొడుకుగా C/o కంచరపాలెం యాక్టర్.. లక్కీ ఛాన్స్ కొట్టేశాడు..
టాలెంట్ ఉంటే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా అవసరం లేదని కొంతమంది నటీనటులు ఉదాహరణగా నిలుస్తుంటారు. చేసింది చిన్న పాత్ర పెద్ద పాత్ర అని లెక్క చేయకుండా నటిస్తే.. కొన్నిసార్లు అదే పెద్ద హెల్ప్ అవుతుంది. ఇక ఇప్పుడు వెంకటేష్ సినిమాలో ఒక యువ నటుడు అదే తరహాలో లక్కీ ఛాన్స్ కొట్టేశాడు.
అతను ఎవరో కాదు..c/o కంచరపాలెం నటుడు కార్తిక్ రత్నం. విమర్శలకుల ప్రశంసలు అందుకొని మంచి గుర్తింపు దక్కించుకున్న ఆ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు క్రేజ్ అందుకున్నారు. ఇక అందులో విభిన్నంగా నటించిన కార్తిక్ కూడా తన కెరీర్ కి యూ టర్న్ ఇచ్చే పాత్రకు సెలెక్ట్ అయ్యాడు. వెంకటేష్ నటిస్తున్న నారప్ప సినిమాలో అతను పెద్ద కుమారుడి పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

నేడు అతని పుట్టినరోజు కావడంతో విషెస్ చెబుతూ.. సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సురేష్ బాబు తమిళ్ నిర్మాత కలైపులి S థనుతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సమ్మర్ లోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా వైరస్ కారణంగా వాయిదా పడుతోన్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











