twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన.. హీరో సిద్దార్థ్‌పై కేసు నమోదు

    |

    హీరో సిద్దార్థ్ సినిమాలతో ఎంత బిజీగా ఉంటాడో తెలీదు కానీ సోషల్ మీడియాలో చాలా బిజీగా ఉంటాడు. కేంద్ర ప్రభుత్వం చేపట్టే చర్యలు, వాటి వైఖరిని ఖండిస్తూ ఉంటాడు. దీని మూలంగా కొందరు సిద్దార్థ్‌ను విమర్శిస్తూ ఉంటారు. సామాజిక విషయాలకు సంబంధించి ఎక్కువగా స్పందించే ఈ హీరో.. వెండితెరపై ఫామ్‌ను కోల్పోతున్నాడు. గతకొన్నేళ్లుగా సరైన హిట్ కొట్టలేక వెనుకబడే ఉన్నాడు.

     సోషల్ మీడియాలో సెటైర్లు..

    సోషల్ మీడియాలో సెటైర్లు..

    సోషల్ మీడియా ప్రతీ విషయంపై సెటైర్లు వేస్తూ ఉంటాడు. సినిమాల్లో అవకాశాలు తగ్గే సరికి ఇలాంటి పనులు చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడని విమర్శించినా.. సిద్దార్థ్ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. తన స్టైల్‌లో కామెంట్లు పెడుతూనే ఉంటాడు.

    ప్రభాస్ ఫ్యాన్స్‌ను కూడా..

    ప్రభాస్ ఫ్యాన్స్‌ను కూడా..

    ఈ మధ్య సోషల్ మీడియాలో తమ అభిమానుల పుట్టినరోజులను ఏవిధంగా ట్రెండ్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంకా వంద రోజులున్నాయి, యాభై రోజులున్నాయంటూ ట్రెండ్ చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రభాస్ ఫ్యాన్స్ తమ హీరో పుట్టినరోజుకు ఇంకా వంద రోజులున్నాయని ట్రెండ్ చేస్తుండగా.. మధ్యలో వచ్చిన సిద్దార్థ్ నా బర్త్‌డేకు ఇంకా 300రోజులున్నాయని సెటైర్ వేశాడు. దీంతో ఫ్యాన్స్ ఫైర్ అవ్వగా.. మళ్లీ వివరణ ఇచ్చుకున్నాడు.

    తాజాగా కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన..

    కేంద్రం ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై దేశం నలుమూలలలా నిరసనజ్వాలలు చెలరేగుతున్నాయి. చెన్నైలోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా, చెన్నైలోని వళ్లువార్ కొట్టంలో భారీస్థాయిలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసనలో సిద్దార్థ్ కూడా పాలుపంచుకున్నాడు.

    సిద్దార్థ్ అరెస్ట్..

    సిద్దార్థ్ అరెస్ట్..

    విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు నిర్వహించిన ఈ నిరసనలో హీరో సిద్ధార్థ్ కూడా పాల్గొన్నాడు. అయితే ఈ ఆందోళనలో పాల్గొన్న నిరసనకారులపై పోలీసులు 143 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో హీరో సిద్ధార్థ్ పైనా కేసు నమోదైంది. అనుమతి లేకుండా నిరసన చేపట్టారని పోలీసులు ఆరోపించారు. రీసెంట్‌గా సిద్దార్ధ్ వదలడు అనే ఓ హారర్ అండ్ యాక్షన్ మూవీ చేశాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న భారతీయుడు 2 లో నటిస్తున్నాడు.

    English summary
    Case Filed On Siddharth Due To Protest Of CAA. Tamil Nadu: Police has filed a case against 600 protesters, including Actor Siddharth, musician TM Krishna, MP Thirumavalavan & MH Jawahirullah, who gathered at Valluvar Kottam in Chennai yesterday to protest against #CitizenshipAct.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X