హనుమాన్‌పై అనుచిత వ్యాఖ్యలు.. ఎస్ఎస్ రాజమౌళిపై ఫిర్యాదు

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న చిత్రం వారణాసి. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో 29వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం, విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు.

ఈ సినిమాకు కథ, మాటల సహకారాన్ని దేవకట్టా అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌గా తమ్మిరాజు, ఫైట్స్ కింగ్ సాల్మన్, సినిమాటోగ్రఫిని ఎస్ గోపాల్ రెడ్డి, పీఎస్ వినోద్ అందిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ రివీల్ ఈవెంట్ ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అయితే ఈ వేడుకలో రాజమౌళి చేసిన ప్రసంగం కొంత వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు అయింది. ఈ కేసు నమోదు వెనుక అసలు కారణం ఏమిటనే వివరాల్లోకి వెళితే..

Case filed on SS Rajamouli

ఈవెంట్‌‌లో.. కు దేవుడి మీద నమ్మకం లేదు. నాన్నగారు వచ్చి ఈవెంట్ సవ్యంగా నడువడానికి హనుమంతుడు వెనుక ఉంటారని చెప్పాడు. కానీ ఈవెంట్ సవ్యంగా సాగలేదు. హనుమపై నాకు కోపం వచ్చింది. ఇలాగేనా నడిపించేది అనిపించింది. మా ఆవిడకు హనుమంతుడంటే చాలా ఇష్టం. ఆయనతో మాట్లాడుతుంటుంది. ఫ్రెండ్‌లా బిహేవ్ చేస్తుంటుంది. ఈ సందర్భంలో మా ఆవిడ మీద కూడా కోపం వచ్చింది. ఏంటి నీ దేవుడు ఇదేనా చేసేది అని కోపం వచ్చింది అని రాజమౌళి అన్నారు.

చిన్నప్పటి నుంచి రామాయణం, మహాభారతం అంటే చాలా ఇష్టం. మహాభారతం తీయడం నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు.. రామాయణంలో ఓ కీలక ఘట్టాన్ని తీస్తున్నానని ఈ సినిమాను మొదలుపెట్టినప్పుడు అనుకోలేదు. ఒక్కో సీన్ రాస్తుంటే.. నేల మీద నడవలేదు. ఎక్కడో ఉన్నానని ఫీల్ కలిగింది. ఫస్ట్ డే మహేష్ బాబును తీసుకొచ్చి రాముడి వేషం వేసినప్పడు రోమాలు నిక్కబొడిచాయి అని రాజమౌళి తెలిపారు.

హనుమంతుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. హిందువుల మనోభావాలను దెబ్బతీశాడనే ఆరోపణలప దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి‌పై పోలీసులకు రాష్ట్రీయ వానరసేన ఫిర్యాదు చేసింది. ఇటీవల వారణాసి చిత్రం కార్యక్రమంలో హనుమంతుడిపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉన్నాయి. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరూ కూడా హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలి అని ఫిర్యాదులో రాష్ట్రీయ వానరసేన పేర్కొన్నట్టు సమాచారం. ఫిర్యాదును అందుకొన్న సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ అధికారులు విచారిస్తున్నారని తెలిసింది. ఈ విషయం అధికారికంగా బయటకు రావాల్సి ఉంది.

రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. సినిమాకు రామాయణ, భారతాలను వాడుకోవడం తెలుసు. కానీ హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఆయన హిందువులకు క్షమాపణలు చెప్పాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో కేసు కూడా నమోదు కావడం వివాదం మరింత ఝటిలమైందనే వాదన తెరపైకి వచ్చింది. ఈ వివాదంపై రాజమౌళి ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Read more about: ss rajamouli Varanasi mahesh babu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X