అల్లు అర్జున్ పుట్టినరోజున.. అర్ధరాత్రి అలాంటి పనులు చేయడంతో కేసు నమోదు

స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా బ్రాండ్ మార్చుకున్న అల్లు అర్జున్ నెక్స్ట్ పాన్ ఇండియా సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్పతో పవర్ఫుల్ గా రెడీ అవుతున్న ఈ స్టార్ హీరో ఈ నెల 8న 38వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఇక పుట్టినరోజు సందర్భంగా అభిమానులు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. అయితే వాళ్ళు చేసిన హడావుడికి విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లినట్లు తెలుస్తోంది.

పవర్ఫుల్ రెస్పాన్స్

పవర్ఫుల్ రెస్పాన్స్

అల్లు అర్జున్ ఎలాంటి సినిమా చేసినా కూడా పుట్టినరోజు వస్తే ఆ సినిమాకు సంబంధించిన ఎదో ఒక స్పెషల్ టీజర్ ను రిలీజ్ చేస్తుంటాడు. సాధారణంగా లోకల్ సినిమా చేస్తేనే ఒక రేంజ్ లో కిక్కిచ్చే బన్నీ మొదటిసారి చేస్తున్న పాన్ ఇండియా సినిమా కాబట్టి అంతకు మించి అనేలా కిక్కిచ్చాడు. పుష్ప ఫస్ట్ లుక్ టీజర్ పవర్ఫుల్ రెస్పాన్స్ అందుకుంది.

అభిమానుల మొక్కలతో నిండిపోయింది

అభిమానుల మొక్కలతో నిండిపోయింది

అల్లు అర్జున్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అల్లు ఆర్మీ పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. ఇక బన్నీని కలుసుకోవాడానికి వస్తే ఎదో ఒక మొక్కను తెస్తుంటారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఉంటున్న ఇంటి గార్డెన్ మొత్తం అభిమానుల మొక్కలతో నిండిపోయింది.

అనుమతులు లేకుండా..

అనుమతులు లేకుండా..

అయితే కొంతమంది అభిమానుల అత్యుత్సాహం వలన ఇటీవల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. పుట్టినరోజు సందర్భంగా చాలా మంది అభిమానులు జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 68లో ఉన్న అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. అనుమతులు లేకుండా అర్ధరాత్రి బాణసంచా కాల్చారు.

Recommended Video

Pushpa Movie ప్యాన్ ఇండియా స్థాయి తగ్గేదేలే | Introducing Pushpa Raj
ఫ్యాన్స్ పై కేసు నమోదు

ఫ్యాన్స్ పై కేసు నమోదు

ఇక పేలుడు శబ్దాలకు విసిగిపోయిన పరిసరాలలో ఉన్న జనాలు అసంతృప్తి వ్యక్తం చేశారు. 100కు డయల్ చేసి పిర్యాదు చేయడంతో వెంటనే పోలీసులు అక్కడికి వచ్చి కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రశాంత్ పై అలాగే మరో అభిమాని సంతోష్ పై కూడా కేసు నమోదు చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ విషయంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X