‘96’ రీమేక్: శర్వానంద్, సమంత సినిమా కోసం కాస్టింగ్ కాల్
సంక్రాంతికి ఎఫ్ 2'తో బ్లాక్ బస్టర్ నమోదు చేసిన దిల్ రాజు నేతృత్వంలోని శ్రీవెంకటేశ్వర సినీ క్రియేషన్స్ తమ సంస్థలో 34వ సినిమా మొదలు పెట్టబోతోంది. శర్వానంద్, సమత హీరో హీరోయిన్లుగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష నటించి ఘన విజయం సాధించిన చిత్రం 96కు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది.
తమిళంలో 96 చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సి.ప్రేమకుమార్ తెలుగు రీమేక్‌ను కూడా తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మార్చి నుండి సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. యంగ్ శర్వానంద్ పాత్రలో నటించే వారి కోసం కాస్టింగ్ కాల్ నిర్వహిస్తున్నారు. వీరి ఎంపిక తర్వాత సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.

త్రిష, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం '96'. రూ. 15 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రూ. 55.5 కోట్లకుపైగా వసూలు చేసి నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది.


Click it and Unblock the Notifications











