‘అమ్మాయిలతో నిర్మాతకి కమిట్మెంట్... ఆ డైరెక్టర్ వల నుంచి అలా తప్పించుకున్నా’

ఎన్నో ఆశలు, కలలతో టాలీవుడ్‌లో అడుగుపెట్టే అమ్మాయిల్ని అవకాశాల పేరుతో ట్రాప్ చేసి వారి జీవితాలను నాశనం చేసే క్యాస్టింగ్ కౌచ్ రక్కసి గురించి చిత్ర పరిశ్రమలో నిత్యం చర్చ జరుగుతూనే ఉంది. నిత్యం ఎక్కడో ఒక చోట మహిళా నటులు, హీరోయిన్లు తమకు జరిగిన దారుణాలను బయటపెడుతూనే ఉన్నారు. తాజాగా టాలీవుడ్‌లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో తనకు జరిగిన అనుభవాన్ని, తెలుగు చిత్ర పరిశ్రమలో చీకటి కోణాలను అమెరికాలో స్థిరపడిన ఓ తెలుగు యువతి బయటపెట్టారు. ఈ వివరాల్లోకి వెళితే..

పీకు నెమలి అనే యువతి అమెరికాలో సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లూయెన్సర్‌గా స్థిరపడ్డారు. వీడియోలు, రీల్స్ చేస్తూ భారీగా ఫాలోయింగ్ సంపాదించారు. ఇక హాట్ హాట్ ఫోటోలతో ఈ ముద్దుగుమ్మ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంటారు. చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి ఉండటంతో తనకు తెలిసిన మార్గాల్లో సినిమాలలో ఆఫర్ల కోసం ట్రై చేస్తోంది. ఈ క్రమంలోనే కొందరు పరిచయస్తుల ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నించగా.. తనకు క్యాస్టింగ్ కౌచ్ వేధింపులు ఎదురైనట్లు పీకు నెమలి పేర్కొంది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పెట్టి ఎమోషనల్ అయ్యింది. అంతేకాదు.. తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు ఎందుకు అవకాశాలు రావడం లేదో కూడా పీకు వెల్లడించింది.

Casting Couch in Tollywood US-Based Telugu Influencer Reveals Shocking Experience

నాకు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎక్స్‌పీరియన్స్ జరిగింది. నెట్‌వర్కింగ్ చేసుకుంటూనే కొంతమంది వ్యక్తులు నాకు పరిచయమయ్యారు. మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా నాకు కొన్ని కాంటాక్ట్స్ దొరికాయి. అలా ఓ అసిస్టెంట్ డైరెక్టర్‌ను సంప్రదించా. దాంతో అతను పొర్ట్‌ఫోలియో, ఫోటోలు పంపించమని అడగటంతో పంపించా. ఆ తర్వాత కాల్ చేసి మాట్లాడా. మీరు ఎంత కమిట్‌మెంట్ ఇస్తారు? అని ఆ వ్యక్తి నన్ను అడిగాడు. నేను యూఎస్‌లో ఉన్నా కదా? వర్క్ విషయంలో కమిటెడ్‌గా ఉంటానో లేదోనని అనుకున్నా. దాంతో నేను బాగా కమిటెడ్, వెరీ ప్రొఫెషనల్, చాలా కమిటెడ్‌గా వర్క్ చేస్తానని చెప్పా. వాడేం అర్ధం చేసుకున్నాడో నాకు తెలియదు.. నాకు ఇంకోలా అర్ధమైందిని పీకు అన్నారు.

మళ్లీ కాల్ చేసి.. ప్రొడ్యూసర్ రెడీగా ఉన్నారు, మీరు ఇండియా ఎప్పుడొస్తారు? రిసార్ట్‌లో కలుద్దామా? అని అడిగాడు. ఆ మాటలతో ఒక్క సెకను పాటు షాకయ్యా. ఇప్పుడే బల్బ్ వెలిగింది. వీడు కమిటెడ్ అంటే దాని గురించి అడుగుతున్నాడా? దాంతో నేను దాని గురించి చెప్పలేదు.. నా వర్క్ కల్చర్, ప్రొఫెషనల్ అని మాత్రమే చెప్పే ఉద్దేశంలో అలా మాట్లాడానని వివరణ ఇచ్చా. ఆ వెంటనే నువ్వు పక్కకి దొబ్బేయ్ అని చెప్పి నెంబర్ బ్లాక్ చేశా. కానీ వాడు మాత్రం వేరే వేరే మార్గాలలో నన్ను సంప్రదించాలని ట్రై చేస్తూనే ఉన్నాడు.. నేను ఒక్కో నెంబర్‌ని బ్లాక్ చేస్తూనే ఉన్నా. దాంతో ఈ పిల్ల మాట్లాడదని ఆ వెధవకి అర్ధమైంది.

ఇది నాకు జరిగిన ఒక అనుభవం మాత్రమే.. కానీ ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ చాలానే ఉన్నాయి. ఇది చూసి నాకు అర్ధమైంది ఒక్కటే.. మన తెలుగువాళ్లు ఎందుకు రావడం లేదో సినిమాల్లోకి. ఎంతో అందం, ప్రతిభ, ప్రొఫెషనల్‌గా ఉన్నప్పటికీ తెలుగు అమ్మాయిలకు ఆఫర్లు ఎందుకు రావడం లేదో నెమ్మదిగా అర్ధమైంది. నాకు కూడా లీగల్‌గా ఇబ్బందులు ఉన్నాయి. అందుకే పేరు చెప్పకుండా ఈ విషయాలు బయటపెడుతున్నా అని పీకు నెమెలి అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆమెను వేధించిన దర్శకుడు ఎవరు? ఏ నిర్మాత కోసం ఇదంతా చేస్తున్నాడు అనేది మాత్రం పీకు బయటపెట్టలేదు.

Read more about: casting couch tollywood news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X