Pushpa The Rule: పుష్ప 2లో మరో లేడీ విలన్.. అప్పుడు లవర్‌గా చేసిన బ్యూటీనే!

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్రమే 'పుష్ప: ద రైజ్'. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి అన్ని ఏరియాల్లోనూ అదిరిపోయే స్పందన రావడంతో పాటు కలెక్షన్లు కూడా అత్యధికంగా వచ్చాయి. ఫలితంగా ఈ మూవీ విడుదలైన అన్ని భాషల్లోనూ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. మరీ ముఖ్యంగా 'పుష్ప' హిందీలో వంద కోట్ల వసూళ్లను కూడా రాబట్టి సత్తా చాటింది.

మొదటి భాగం సూపర్ డూపర్ హిట్ అవడంతో, ఈ సినిమా రెండో భాగం అయిన 'పుష్ప ద రూల్' మూవీపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో రెండో పార్ట్‌కు సంబంధించిన షూటింగ్‌ను మరింత ఉత్సాహంగా జరపాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. త్వరలోనే దీన్ని ప్రారంభించాలని చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్ మొదలు కాకుండానే ఈ మూవీ గురించి ఎన్నో రకాల వార్తలు తెరపైకి వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఇందులో ఫలానా వాళ్లు కీలక పాత్రలను పోషిస్తున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎంతో మంది పేర్లు కూడా బయటకు వస్తున్నాయి.

Catherine Tresa Key Role in Pushpa The Rule

'పుష్ప ద రూల్' మూవీలో అనసూయ భరద్వాజ్ కాకుండా మరో లేడీ విలన్ రోల్ కూడా ఉందని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఈ పాత్రను క్యూట్ హీరోయిన్ కేథరిన్ థ్రెస్సా చేస్తున్నట్లు కూడా తెలిసింది. ఇప్పటికే ఆమెపై లుక్ టెస్టును కూడా దర్శకుడు సుకుమార్ పూర్తి చేసుకున్నాడని తెలుస్తోంది. దీంతో ఈమె పాత్రపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. ఇదిలా ఉండగా.. గతంలో కేథరిన్ థ్రెస్సా.. అల్లు అర్జున్‌తో 'ఇద్దరమ్మాయిలతో', 'సరైనోడు' చిత్రాల్లో నటించింది. అందులో లవర్‌గా చేసిన ఈ భామ.. ఇప్పుడు విలన్‌గా మారబోతుందట.

Catherine Tresa Key Role in Pushpa The Rule

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ - సుకుమార్ కాంబోలో రాబోయే చిత్రమే 'పుష్ప ద రూల్'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు. సునీల్, అనసూయ కీలక పాత్రలు చేయనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని ఇస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X