Casting Call యువ నటీనటులకు అరుదైన అవకాశం.. ఆనంద్ దేవరకొండ ‘బేబీ’ సినిమాలో ఆఫర్ కావాలా?

యువ హీరో ఆనంద్ దేవరకొండ వరుస సినిమాలతో జోరును కొనసాగిస్తున్నారు. లాక్‌డౌన్‌లో మిడిల్ క్లాస్ మెలోడిస్, తాజాగా పుష్పక విమానం చిత్రాలతో సక్సెస్‌ను సొంతం చేసుకొన్న ఆయన మరో సినిమాను పట్టాలెక్కించే ప్రయత్నం చేశారు. తాజాగా నిర్మాత ఎస్‌కేఎన్ నిర్మించే చిత్రం బేబీ పూజా కార్యక్రమాలు ఇటీవల మొదలయ్యాయి. అయితే యువ నటీనటులతో ఈ సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేస్తూ.. నూతన నటీనటుల కోసం ప్రకటన ఇచ్చారు.

Cating Call for Anand Deverakondas Baby movie

ఈ క్రమంలోనే యువ ప్రతిభావంతులైన నటీనటులకు అవకాశం కల్పించేందుకు ముందుకొచ్చింది బేబి మూవీ టీమ్. 18 నుంచి 23 ఏళ్ల వయసున్న యువతీ యువకులు కాలేజ్ స్టూడెంట్స్ రోల్స్ కోసం కాస్టింగ్ కాల్ అనౌన్స్ చేసింది. స్టైలిష్, చూడటానికి ఆకర్షణీయంగా కనిపించే లుక్‌తో ఉండే కాలేజ్ స్టూడెంట్స్ క్యారెక్టర్స్ బేబి సినిమాలో కావాల్సి ఉంది. ఆసక్తి ఉన్నవారు వారి ఫొటోలను 8143910439 కు వాట్సాప్ చేయొచ్చు.

ఔత్సాహిక నటీనటులు ఫోటోలును వీడియోలను పంపించవచ్చు. కానీ టిక్ టాక్, ఇతర సోషల్ మీడియా వీడియోలు పంపించకూడదని చెప్పారు.

ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య నటిస్తున్న బేబి సినిమా దసరా పండుగ సందర్భంగా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ సంస్థలో ఎస్ కే ఎన్ నిర్మిస్తుండగా...సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X