Jeevitha Rajasekhar: నేను వైసీపీలో లేను, బీజేపీ నాయకురాలిని - సీబీఎఫ్‌సీ గురించి చర్చ ఎందుకు?
నటి జీవితా రాజశేఖర్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తలంబ్రాలు సినిమాతో 1986లో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈమె.. ఆ తర్వాత చాలానే చిత్రాల్లో చేసింది. సినిమాలు చేస్తుండగానే.. హీరో రాజశేఖర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత ఆమె సినిమాలు చేయడం తగ్గించేసింది. 1990లో చివరగా అంకుశం సినిమాలో కనిపించిన ఈమె.. ఆ తర్వాత ఏడాదే పెళ్లి చేసుకుంది. ఇక అప్పటి నుంచి కేవలం ఇంటి బాధ్యతలు మాత్రమే చూసుకుంటూ వచ్చింది. పదేళ్ల తర్వాత డైరెక్షన్ కూడా చేసింది. శేషు, మహంకాళి, సత్యమేవ జయతే సినిమాలకు దర్శకత్వం వహించింది.
ఆ తర్వాత సినిమాల్లో కనిపించకపోయినా.. బుల్లి తెరపై మాత్రం కనిపిస్తూనే వస్తోంది. ప్రస్తుతంత ఈమె సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. అయితే జీవితా రాజశేఖర్ గతంలో వైఎస్సార్ సీపీ పార్టీలో ఉన్నారు. ఈక్రమంలోనే నిర్మాత నట్టి కుమార్ జీవితా రాజశేఖప్ పై కేంద్ర సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. ఎందుకు అంటే... డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా తెరకెక్కించిన చిత్రం వ్యూహం. ఈ సినిమాను అడ్డుకోవడానికి ప్రొడ్యూసర్ నట్టి కుమార్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈక్రమంలోనే జీవితా రాజశేఖర్ వైసీపీ పార్టీకి చెందిన వారు అని.. ఆమెను సెన్సార్ బోర్డు మెంబర్ గా తొలగించాలని కోరుతూ... కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.

మరోవైపు వ్యూహం సినిమా సెన్సాప్ సర్టిఫికేషన్ కోసం నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ అప్లికేషన్ ను హైదరాబాద్ లోని ప్రాంతీయ సెన్సార్ బోర్డు తిరస్కరించింది. దీంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ రివైజింగ్ కమిటీ కి ఈ సినిమాను సిఫార్సు చేశారు. అయితే రివైజింగ్ కమిటీ ఈ సినిమాను చూసి సర్టిఫికేట్ ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయిస్తుంది. అయితే ఇందులో సభ్యురాలిగా ఉన్న జీవితా రాజశేఖర్.. వైసీపీ మద్దతుగా ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తారని నట్టి కుమార్ భావిస్తున్నారు.
అందుకే ఆమెను సెన్సార్ బోర్డు నుంచి ముఖ్యంగా రివైజంగ్ కమిటీ నుంచి తొలగించాలని కోరుతూ కేంద్ర సెన్సార్ బోర్డుకు నిర్మాత నట్టి కుమార్ లేఖ రాశారు. అలాగే డైరెక్టర్ రాంగోపాల్ వర్మతో.. జీవితా రాజశేఖర్ కు ఉన్న సంబంధాల గురించి కూడా అందులో వివరించారు. అలాగే ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ కుమార్ కూడా వేసీపీ నాయకుడు అని.. ఆయనను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ గా కూడా వైసీపీ నియమించిందని వివరించారు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని వ్యూహం సినిమా సెన్సార్ నుంచి జీవితా రాజశేఖర్ ను తప్పించాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

దీనిపై జీవితా రాజశేఖర్ స్పందించారు. తాను ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉన్నట్లు వెల్లడించింది. తనకు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. మీడియా గ్రూపులో వ్యాప్తి చెందుతున్న ఫొటోలు చాలా ఏళ్ల క్రితంవి అని వివిరంచింది. వ్యూహం అనే సినిమా ఆర్సీ వచ్చినప్పుడు అన్ని సినిమాలు చూసినట్టుగానే ఆ సినిమాను కూడా చూస్తానని జీవితా రాజశేఖర్ చెప్పుకొచ్చింది. తనకు ఇంకా ఆఫీస్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదని, తన గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారో తనకు అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.


Click it and Unblock the Notifications











