36 ఏళ్ల తర్వాత రజనీకి సెన్సార్ షాక్.. కూలీపై అలా దెబ్బ?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కు సెన్సార్ బోర్డ్ షాక్ ఇచ్చింది. తమిళ చిత్ర పరిశ్రమలో రూపుదిద్దుకుంటున్న భారీ గ్యాంగ్ స్టర్ అండ్ యాక్షన్ ఫిల్మ్ కూలితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించడం విశేషం. ఇక ఈ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ఆగస్టు 14న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈక్రమంలో సెన్సార్ బోర్డు ఈ చిత్రాకి A సర్టిఫికెట్ ఇవ్వడం చర్చగా మారింది. రజనీకాంత్ కెరీర్ లో 36 ఏళ్ల తర్వాత సెన్సార్ బోర్డు తీర్పు మరోసారి షాక్ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. గతంలోనూ రజనీకాంత్ చిత్రాలకు A సర్టిఫికెట్ రావడం గమనార్హం. ఆ వివరాల్లోకి వెళితే..

1982 నుంచి 1989 వరకు..
రజనీకాంత్ కు అంటూ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే సెపరేట్ స్టైల్ ఉండింది. ఆయన డైలాగ్ డెలివరీ, వాకింగ్ స్టైట్, అటిట్యూడ్ కు ఇండియాలోనే కాకుండా వరల్డ్ లోనూ ఫ్యాన్స్ ఉండటం విశేషం. 70 ఏళ్ల వయస్సు దాటినా ఆయన బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ చిత్రాలతో అలరిస్తూ ఉండటానికి మూలకారణం అదే. అయితే రజనీకాంత్ కెరీర్ ప్రారంభంలో.. ముఖ్యంగా 1982 నుంచి 1989 మధ్యలో వచ్చిన చిత్రాలు తమిళ చిత్ర పరిశ్రమలో సెన్సేషనల్ గా మారాయి. టూ మచ్ వైలెన్స్ తో పలు చిత్రాలకు A సర్టిఫికెట్ రావడం గమనార్హం.

CBFC Shocked to Rajinikanth With Coolie Movie After 36 Years

1981లో వచ్చిన నేత్రిక్కన్, 1982లో విడులైన పుధు కవితై, 1984లోని నాన్ మహాన్ అల్లా, 1985లో రిలీజ్ అయిన నాన్ సిగప్పు మనితాన్, ఇక చివరిగా 1989లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శివ అనే చిత్రంతో రజనీకాంత్ మాస్, వైలెన్స్, స్టంట్స్, యాక్షన్ తో అదరగొట్టారు. అయితే అప్పట్లో ఈ చిత్రాల్లో ఉన్న పలు సన్నివేశాల కారణంగా సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇచ్చిందని తెలుస్తోంది. ఇక 36 ఏళ్ల తర్వాత 2025 ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కూలి చిత్రానికి మళ్లీ ఏ సర్టిఫికెట్ రావడం ఆశ్చర్యంగా మారింది.

నో కాంప్రమైజ్..
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రాలన్నింటికీ సెన్సార్ బోర్డు ఇచ్చే రివ్యూ ఆసక్తికరంగా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా ఖైదీ చిత్రం మొదలు మాస్టర్, విక్రమ్, లియో సినిమాలకు U/A సర్టిఫికెట్స్ అందాయి. అయితే రజనీకాంత్ తో సినిమా అనే సరికి మరింత వైలెన్స్ ను జోడించారంట దర్శకుడు లోకేష్ కనగరాజ్. కూలి చిత్రం వైలెన్స్ విషయంలో నో కాంప్రమైజ్ అనే రూల్ పెట్టుకున్నాకే సినిమాను మొదలు పెట్టారంట డైరెక్టర్. దీంతో సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

1000 కోట్లు అంచనా?
రజనీకాంత్, అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్, పూజా హెగ్దే, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ లాంటి స్టార్ కాస్ట్ నటించిన కూలి చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించడం మరంత హైప్ నిస్తోంది. 350 కోట్ల బడ్జెట్ తో చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించడం విశేషం. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X