Aryan Khan డ్రగ్స్ కేసులో మరో ట్విస్టు.. షారుక్ ఖాన్ కొడుకు విషయంలో రంగంలోకి సీబీఐ

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్టు చోటుచేసుకొన్నది. 2021 అక్టోబర్ 2వ తేదీన ముంబై నుంచి గోవాలకు వెళ్లే క్రూయిజ్‌లో డ్రగ్స్‌తో ఉన్నాడనే కారణంతో ఆర్యన్ ఖాన్‌ను ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అరెస్ట్ చేయడం సంచలనం రేపింది.

ఆర్యన్ ఖాన్ అరెస్ట్ ఎన్సీబీ ముంబై జోన్ డైరెక్టర్ సమీర్ వాంఖెడీ పర్యవేక్షించారు. ఈ సంచలన అరెస్ట్ తర్వాత సమీర్‌పై తలెత్తిన ఆరోపణలపై విచారించేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. ఈ ట్విస్టుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

CBI files FIR on NCB Zonal Director Sameer Wankhede over 25 crores bribe from Shah Rukh Khan family

25 కోట్ల ముడుపుల డిమాండ్: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్‌ను వదిలిపెట్టేందుకు భారీగా ముడుపులు డిమాండ్ చేశాడు. షారుక్ ఖాన్‌ ఫ్యామిలీని కోట్ల రూపాయలు ఇవ్వమని ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలపై ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడే సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం సంచలనంగా మారింది. సమీర్ వాంఖేడేపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు సీబీఐ అధికారులు సిద్దమయ్యారు.

CBI files FIR on NCB Zonal Director Sameer Wankhede over 25 crores bribe from Shah Rukh Khan family

ఆర్యన్ ఖాన్‌పై కేసు నమోదు: డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడిన ఆర్యన్ ఖాన్‌పై కేసు నమోదు చేయించి జైలుకు పంపిస్తాం. కేసు నమోదు, అరెస్ట్ నుంచి ఆర్యన్ ఖాన్‌ను తప్పించాలంటే కనీసం 25 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందేనని సమీర్ వాంఖడేపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ ఆరోపణల ఆధారంగా సమీర్ వాంఖేడేపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

CBI files FIR on NCB Zonal Director Sameer Wankhede over 25 crores bribe from Shah Rukh Khan family

సమీర్ వాంఖేడే విదేశీ పర్యటనలు: ఆర్యన్ ఖాన్‌ అరెస్ట్ తర్వాత షారుక్ ఖాన్ ఫ్యామిలీని బెదిరింపులకు పాల్పడ్డారనే విషయం పక్కన పెడితే.. ఇటీవల కాలంలో విలాసవంతమైన విదేశీ పర్యటనలు, ఖరీదైన వాచీలు ధరించడం, ఇతర ఖరీదైన ఆస్తుల కొనుగోళ్ల అంశాలు ఎన్సీబీ ఇంటెలిజెన్స్ విభాగం దృష్టికి వచ్చాయి. దాంతో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

CBI files FIR on NCB Zonal Director Sameer Wankhede over 25 crores bribe from Shah Rukh Khan family

సీబీఐ దర్యాప్తుతో ఉలిక్కిపడ్డ ఎన్సీబీ: ఆర్యన్ ఖాన్ అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలను పరిగణనలోకి తీసుకొన్న తర్వాత సమీర్ వాంఖేడేతోపాటు విశ్వ విజయ్ సింగ్, ఆశీష్ రంజన్, కేపీ గోస్వామి, సాన్‌విల్లే డిసౌజా తదితరులుపై కేసు నమోదు చేశారు. కేపీ గోస్వామి ప్రధాన సాక్షిగా ఈ కేసులో ఉన్నారు. ఏకంగా ఎన్సీబీ అధికారిపై సీబీఐ దర్యాప్తు చేయడం చర్చనీయాశంమయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X