twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంకల్పానికి సమన్వయం తోడయితే.. కరోనాపై పోరులో చిరంజీవి

    |

    దేశాన్ని గజగజా వణికిస్తున్న కరోనాపై పోరాటానికి టాలీవుడ్ లోకం నడుం బిగించిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా పేదలు, రోజు వారి సినీ కార్మికులు ఆదాయం కోల్పోవడంతో వారికి అండగా ఉండేందుకు గాను మెగాస్టార్ ఆధ్వర్యంలో సీసీసీ ఏర్పాటు చేసి దాని ద్వారా విరాళాలు సేకరిస్తున్నారు. ఇలా వచ్చిన సొమ్మును పేద కార్మికులకు నిత్యావసర సరుకుల రూపంలో పంచుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ వేదికగా భావోద్వేగ ట్వీట్ చేశారు. ఆ వివరాలు చూద్దామా..

    చిరంజీవి సార‌థ్యంలో క‌రోనా క్రైసిస్ చారిటీ..

    చిరంజీవి సార‌థ్యంలో క‌రోనా క్రైసిస్ చారిటీ..

    మెగాస్టార్ చిరంజీవి సార‌థ్యంలో క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) ‘మనకోసం'ను సినీ కార్మికుల్ని ఆదుకునేందుకు ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఛారిటీకి యావత్ సినీ లోకం తమ మద్దతు తెలియజేస్తూ పెద్ద ఎత్తున విరాళాలు అందించారు. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ సహా తెలుగు సినీ పరిశ్రమలోని స్టార్ హీరోలంతా తమ తమ ఆర్థిక సాయం అందించారు.

    24 శాఖ‌ల కార్మికుల్లో పేద‌ల‌కు నిత్యావసర సరుకులు

    24 శాఖ‌ల కార్మికుల్లో పేద‌ల‌కు నిత్యావసర సరుకులు

    ఈ ఆదివారం నుంచి 24 శాఖ‌ల కార్మికుల్లో పేద‌ల‌కు నిత్యావసర స‌రుకులను పంపిణీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్నట్లుగానే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ద‌ర్శక‌నిర్మాత‌ త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ, ద‌ర్శక‌ సంఘం అధ్యక్షుడు ఎన్. శంక‌ర్ బృందం సినీ కార్మికుల‌కు నిత్యావ‌స‌రాల పంపిణీ చేశారు.

     ప్రతి కార్మికుడు ధైర్యంతో ఉండండి..

    ప్రతి కార్మికుడు ధైర్యంతో ఉండండి..

    ''చిరంజీవి గారి సార‌థ్యంలో ఏర్పాటైన క‌మిటీ అద్భుత ఆలోచ‌న చేసి సినీ ప‌రిశ్రమ‌లో ప్రతి కార్మికుడి ఇంటికి నెల‌కు స‌రిప‌డా బియ్యం, ప‌ప్పు, ఉప్పు, ఇతర నిత్యావసర సరుకులన్నీ అందించాలని నిర్ణయించాయి. నేటి నుంచి ఆ పంపిణీ కార్యక్రమం మొద‌లుపెట్టాము. ఇది నిరంత‌రం సాగే ప్రక్రియ ఇది. ప్రతి కార్మికుడు సీసీసీ మాకు ఆహార‌ భ‌ద్రత‌నిస్తుంది అన్న ధైర్యంతో ఉండండి. ఈ కార్యక్రమానికి ముఖ్య క‌ర్త అయిన మెగాస్టార్ చిరంజీవి గారితో స‌హా దాతలంద‌రికీ కృత‌జ్ఞత‌లు తెలియ‌జేస్తున్నాను'' అని ఎన్. శంక‌ర్ ఆ సందర్బంగా తెలిపారు.

    సంకల్పానికి సమన్వయం తోడయితే..

    ఈ మేరకు చిరంజీవి ట్వీట్ చేస్తూ.. ''సంకల్పానికి సమన్వయం తోడయితే,తోటి కార్మిక సోదరుల కుటుంబాలకి కష్టసమయంలో భరోసానివ్వగలం అని,అండగా నిలవగలం అని ఋజువు చేసిన తెలుగు సినీ పరిశ్రమ కి, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు'' అని పేర్కిన్నారు.

    English summary
    In Corona Effect Tollywood celebrities gave Donations To Corona Crisis Charity. Now Chiranjeevi's CCC team N. Shankar and batch distributed daily needs to poor people.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X