బాలుగారు ఇది న్యాయం కాదు.. గుండెబద్దలయ్యేలా ఎడుస్తున్నా: థమన్, రమ్యకృష్ణ, కుష్బూల ఆవేదన

ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం ఇక లేరు అనే మాట నమ్మలేకపోతున్నాం అంటూ కోట్లాది మంది అభిమానులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఏ బాషా వారైనా కూడా బాలు మా వాడు అనేలా ఆయనను ఒక దైవంలా ఆరాధించారు. ఒక సంగీత కళాకారుడికి కూడా ఈ స్థాయిలో భక్తులు ఉండడం చాలా రేర్. ఇక సెలబ్రెటీలు ఆయనకు క్లోజ్ గా ఉండే సినీ తారలు ఎంతగానో రోధిస్తున్నారు. నిజంగా ఇది హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రమ్యకృష్ణ , కృష్ణవంశీల మనోవేదన..

రమ్యకృష్ణ , కృష్ణవంశీల మనోవేదన..

ఇంత ప్రత్యేకమైన వ్యక్తిని ఎప్పటికీ మరచిపోలేము, అతని ఆత్మ శాంతితో విశ్రాంతి తీసుకోవాలని కోరుకుంటున్నా. ఆయన కుటుంబానికి నా ప్రగాడ సంతాపం తెలియజేస్తున్నాను అంటూ రమ్యకృష్ణ ట్వీట్ చేయగా.. కృష్ణవంశీ కూడా తీవ్ర మనోవేదనకు గురవుతూ నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

గండే బద్దలైంది.. ఎందుకిలా చేశారు

గండే బద్దలైంది.. ఎందుకిలా చేశారు

ఇక బాలసుబ్రహ్మణ్యంకు చిన్నప్పటి నుంచి అమితంగా ఆరాధించే వారిలో కుష్బూ ఒకరు. ఆమె అయితే ఈ మరణ వార్తను అస్సలు తట్టుకోలేకపోతున్నారు. పూర్తిగా గుండె బద్దలైంది. మాటలు రావట్లేదు. కన్నీళ్లు ఆగట్లేదు. సర్ మీరు ఈ విధంగా మమ్మల్ని వదిలిపెట్టడం న్యాయం కాదు. ఎందుకు ఇలా? బాలుగారు ఎందుకు మరణించారు. గట్టిగా ఎడుస్తున్నాను.. RIP అంటూ కుష్బూ ట్వీట్ చేసింది.

అతని స్వరం శాశ్వతంగా ఉంటుంది

అతని స్వరం శాశ్వతంగా ఉంటుంది

ఇక మరో సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ నిన్నటి నుంచే చాలా బాధతో ట్వీట్స్ చేస్తున్నారు. పరిస్థితి విషమించింది అన్నప్పటి నుంచి ఆమె తట్టుకోలేకపోతున్నారు. ఇక ఇప్పుడు మరణ వార్త గురించి తెలులుకోని.. నిజంగా ఇది గుండె ముక్కలైన రోజు. తన జీవితాన్ని అందంగా గడిపారు. ఆయన సమాజానికి అభిరుచి మరియు సంగీతాన్ని అందించాడు. అతని స్వరం శాశ్వతంగా ఉంటుంది. ఆత్మ శాంతించుగాక అని ట్వీట్ చేశారు.

Recommended Video

Rajinikanth,Pawan Kalyan,K viswanath Expresses Their Condolences For SPB
నా కనీళ్లను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను

నా కనీళ్లను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను

ఇక ఈ తరం మ్యూజిక్ దర్శకులతో బాలు స్వరాన్ని ఎంతగానో ఇష్టపడే థమన్ కూడా తీవ్ర మనోవేదనకు లోనయ్యారు. మామా నా కనీళ్లను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నిజంగా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. హార్ట్ నిజంగా బ్రేక్ అయ్యిందని థమన్ బావోద్వేగానికి లోనవుతు ట్వీట్ చేశారు. ఇక దర్శకుడు క్రిష్ 'మృత్యోర్మా అమృతం గమయ!' అని తన భావనను తెలియజేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X