టీమిండియా చారిత్రాత్మక విజయం..గర్వంగా ఉందంటూ మహేష్, వెంకటేష్ ఎమోషనల్ ట్వీట్స్
ఇండియా ఏ ఆటలో విజయాన్ని అందుకున్నా కూడా ఒక బారతీయుడిగా గర్వపడే ఫీలింగ్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక టీమిండియా క్రికెట్ ఆటలో అలాంటి విజయాలను ఎన్నోసార్లు అందుకుంది. అయితే రీసెంట్ గా చరిత్రలోనే నిలిపోయే విజయన్ని అందుకొని ప్రపంచవ్యాప్తంగా అందరిని ఆకర్షించింది. ఇక మన సినిమా సెలబ్రెటీలు కూడా ఈ విజయంపై ఎంతో ఎమోషనల్ గా ట్వీట్స్ చేస్తున్నారు.

32ఏళ్ల తరువాత ఆసీస్ ఓటమి
గబ్బా వేదికగా జరిగిన మూడవ టెస్టులో టీమిండియా ఘన విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో 2-1 సిరీస్ ను దక్కించుకున్న భారత జట్టు చరిత్ర సృష్టించింది. ఎందుకంటే బ్రిస్బాన్ గబ్బా స్టేడియంలో ఆసీస్ ను ఓడించడం అంత సాదరణమైన విషయం కాదు. దాదాపు 32 ఏళ్ళ తరువాత ఆ వేదికలో మొదటి సారి ఆస్ట్రేలియా జట్టు ఓటమిని చవిచూసింది.

మరోసారి చరిత్ర నమోదైంది: మహేష్
అందుకే ఈ గెలుపును దేశమంతా సెలబ్రేట్ చేసుకుంటోంది. ఇక మహేష్ బాబు మరోసారి భారత జట్టు విజయం ఎంతో గర్వకారణం అంటూ ట్వీట్ చేశాడు. మరోసారి చరిత్ర నమోదైంది అంటూ గబ్బాను జయించారని అన్నాడు. అలాగే 2-1తో సిరీస్ ను ముగించిన టీమిండియా చిరాకాలం గుర్తిండిపోయేలా విజయాన్ని అందించిందని, నిజంగా ఇది చాలా గర్వకారణమని కూడా అన్నారు.

నిజమైన ఛాంపియన్స్: అక్షయ్ కుమార్
ఇక అక్షయ్ కుమార్ మరోసారి టీమిండియా జట్టుపై ప్రశంసలు కురిపించారు. ఇంత గొప్ప విజయం అందుకున్న టీమిండియాకు కంగ్రాట్స్. ఈ విజయంతో ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు అంటూ చరిత్ర సృష్టించారని అన్నారు. అలాగే నిజమైన ఛాంపియన్స్ మన ఇండియన్స్ అంటూ కొనియాడారు.
Recommended Video

ఎంతో గర్వకారణం: వెంకటేష్
ఇక వెంకటేష్ అయితే ఏకంగా టీవీలో భారత జట్టు విజయాన్ని సెల్ఫీ తీసుకుంటూ టీమిండియా అమేజింగ్ అంటూ ట్వీట్ చేశారు. నేడు జరిగిన ఇండియా vs ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ లో ఇండియా జట్టు అద్భుతమైన విజయాన్ని అందుకోవడం ఎంతో గర్వకారణమని అన్నారు. ఇక టీమ్ సభ్యులందరికి కంగ్రాట్స్ అని ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











