twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Lata Mangeshkar : ఆవేదన వ్యక్తం చేసిన మోదీ.. తీరని లోటంటూ వెల్లడి.. ఇతర రాజకీయ ప్రముఖులు ఏమన్నారంటే?

    |

    ప్రముఖ గాయని భారతరత్న లతా మంగేష్కర్ 92 సంవత్సరాల వయస్సులో ఫిబ్రవరి 6న ఆదివారం మరణించారు. ఆమె తుది శ్వాస విడిచారన్న వార్త బయటకు రావడం అందరికీ తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. లతా పార్థివదేహానికి నివాళులు అర్పించడానికి ముంబైలోని శివాజీ పార్క్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మరోవైపు సోషల్ మీడియా ద్వారా ప్రధానమంత్రితో పాటు పలువురు ప్రముఖులు లతా మంగేష్కర్ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. ఆ వివరాలు...

    న్యుమోనియా కూడా

    న్యుమోనియా కూడా

    లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ జనవరి మొదట్లో కరోనా బారిన పడింది. ఆమెకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన వెంటనే ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఆమె అప్పటికే అనారోగ్యంతో ఉండడంతో ముందు జాగ్రత్తగా లతాను ఐసీయూలో ఉంచి ప్రత్యేక ట్రీట్మెంట్ చేశారు డాక్టర్స్. మూడు వారాల పాటు ఐసీయూలో ఉంచిన లతా మంగేష్కర్ ఆదివారం నాడు ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఇక లతా మంగేష్కర్ కు కరోనాతో పాటు అప్పటికే న్యుమోనియా కూడా ఉండడంతో ఆమె కోలుకోలేకపోయారు.

    నరేంద్ర మోడీ సంతాపం

    నరేంద్ర మోడీ సంతాపం

    లతా మంగేష్కర్ ఈరోజు ఉదయం 8:12 గంటలకు తుది శ్వాస విడిచారన్న వార్త బయటకు రావడం అందరికీ తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తాను చెప్పలేనంత వేదనలో ఉన్నానని, దయ మరియు శ్రద్ధ గల లతా దీదీ మనల్ని విడిచిపెట్టారని, ఆమె మన దేశంలో పూరించలేని శూన్యాన్ని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే తరాలు ఆమెను భారతీయ సంస్కృతికి నిదర్శనంగా గుర్తుంచుకుంటాయని, ఆమె మధురమైన స్వరం ప్రజలను మంత్రముగ్ధులను చేయగల అసమానమైన సామర్థ్యాన్ని కలిగి ఉందని అన్నారు.

     గౌరవంగా భావిస్తున్నా

    గౌరవంగా భావిస్తున్నా

    లతా దీదీ పాటలు రకరకాల ఎమోషన్స్‌ని తీసుకొచ్చాయని, ఆమె దశాబ్దాలుగా భారతీయ చలనచిత్ర ప్రపంచం మార్పులను దగ్గరగా చూసిందని, సినిమాలకు అతీతంగా, ఆమె భారతదేశం యొక్క అభివృద్ధిపై ఎల్లప్పుడూ మక్కువ చూపేదని, ఆమె ఎల్లప్పుడూ బలమైన అభివృద్ధి చెందిన భారతదేశాన్ని చూడాలని కోరుకుంటుందని గుర్తు చేసుకున్నారు. లతా దీదీ నుండి నేను అపారమైన ప్రేమను పొందడం నా గౌరవంగా భావిస్తున్నానని, ఆమెతో నా పపరిచయం మరువలేనిదని, లతా దీదీ మరణించడం బాధను కలిగించిందని అంటూ ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

    కేసీఆర్

    కేసీఆర్

    ప్రఖ్యాత నేపథ్య గాయని, భారతరత్న లతా మంగేష్కర్ మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఎనిమిది దశాబ్దాల పాటు తమ పాటలతో సినీ సంగీత రంగంపై చెరగని ముద్రవేసిన లతాజీ మరణం భారత సినీ, సంగీత రంగానికి తీరని లోటని, సప్త స్వరాల తరంగ నాదాలతో శ్రోతలను తన్మయత్వంలో ఓలలాడించిన లతాజీ ఉత్తర దక్షిణ భారత సంగీత సరిగమల వారధి అని అన్నారు. హిందుస్తానీ సంప్రదాయ సంగీతాన్ని ఉస్తాద్ అమంత్ అలీఖాన్ వద్ద నేర్చుకున్న లతాజీ ఉర్దూ కవుల సాహిత్యాన్ని అధ్యయనం చేసి గజల్ గమకాలను శ్రావ్యంగా ఒలికించేదని గుర్తు చేసుకున్నారు సీఎం. లతాజీ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి అని సీఎం కేసీఆర్ ప్రకటన విడుదల చేశారు.

    నిర్మలా సీతారామన్

    నిర్మలా సీతారామన్

    ఇక ఇండియన్ ఫైనాన్స్ మినిష్టర్ నిర్మలా సీతారామన్ కూడా ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేశారు. "లతా మంగేష్కర్ ఇక లేదు. తరాల భారతీయులు ఆమె పాటలను వినడానికి ఇష్టపడతారు. అవి ఎవర్ గ్రీన్ గా ఉంటాయి. ఆమె సంగీతానికే అంకితమైన జీవితాన్ని గడిపింది. ఆమె కుటుంబానికి, సంగీత ప్రియులందరికీ సానుభూతి" అంటూ ట్వీట్ చేశారు.

    English summary
    Political Celebrities Tribute to Lata Mangeshkar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X