ఆ ఫీలింగ్ పోయి ఈ ఫీలింగ్ వస్తుంది.. 'సరిలేరు నీకెవ్వరు'పై సెలబ్రిటీల రియాక్షన్
మహేష్ బాబు హీరోగా ఆయన 26వ సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది 'సరిలేరు నీకెవ్వరు'. ఈ రోజే (జనవరి 11) విడుదలైన ఈ సినిమాకు ప్రీమియర్స్ ద్వారానే సక్సెస్ టాక్ వచ్చేసింది. ఈ మేరకు 'సరిలేరు నీకెవ్వరు' ప్రీమియర్స్ చూసిన లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి ట్విట్టర్ వేదికగా స్పందించారు. అదేవిధంగా డైరెక్టర్ బీవీఎస్ రవి తన రెస్పాన్స్ చెప్పారు. వివరాల్లోకి పోతే..

ప్రత్యేకంగా ప్రీమియర్స్.. సోషల్ మీడియాలో రియాక్షన్
ఓ రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ నడుమ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమా విడుదలైంది. ఇంకా రెగ్యులర్ షోస్ పడకముందే ప్రీమియర్స్ కోసం జనం పోటెత్తారు. ఓవర్సీస్‌తో పాటు ఆంధ్రాలో పలుచోట్ల, సెలబ్రిటీల కోసం ప్రత్యేకంగా గత అర్థరాత్రి సరిలేరు నీకెవ్వరు ప్రీమియర్ షోస్ పడ్డాయి. ఈ షోస్ కొందరు సోషల్ మీడియా ద్వారా రియాక్ట్ అయ్యారు.

రామజోగయ్య శాస్త్రి ట్వీట్..
పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ఒక్క మూడు నెలలు ఆర్మీలో పని చేస్తే.. నేను అనే ఫీలింగ్ పోయి నేషన్ అనే ఫీలింగ్ మొదలవుతుంది'' అనే డైలాగ్ ట్వీట్ చేశారు. సినిమాలో అనిల్ రావిపూడి రాసిన డైలాగులు అద్భుతంగా ఉన్నాయని చెప్పారు.
మాస్ మహేష్ బాబు.. దేవి శ్రీ మ్యూజిక్
అనిల్ రావిపూడి టేకింగ్‌లో మహేష్ బాబు మాస్ విశ్వరూపం చూపించాడని అన్నారు రామజోగయ్య శాస్త్రి. దేవి శ్రీ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిందని అన్నారు. ఏకె ఎంటర్టైన్మెంట్స్‌కి బ్లాక్‌బస్టర్ హిట్ పడిందని ఆయన పేర్కొన్నారు. ''బొమ్మ దద్దరిల్లిపోయింది'' అని చివరగా తెలిపారు.
ఇక సెలబ్రేషన్ టైమ్..
సరిలేరు నీకెవ్వరు టీమ్‌కి ఇక సెలబ్రేషన్ టైమ్ అని మరో డైరెక్టర్ బీవీఎస్ రవి పేర్కొన్నారు. ఈ సందర్బంగా ట్వీట్ చేసిన ఆయన.. ''మహేష్ కెరీర్‌లో సరిలేరు నీకెవ్వరు మూవీ బిగ్గెస్ట్ సినిమాగా నిలుస్తుంది. విజయశాంతి రీ ఎంట్రీ అదిరింది. కంగ్రాట్స్ మై డియర్ అనిల్ రావిపూడి'' అని తెలిపారు.

మహేష్ బాబు డాన్స్.. మైండ్ బ్లాక్
సరిలేరు నీకెవ్వరు సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మరో అంశం మహేష్ డ్యాన్స్. ఆయన చాలా కొత్తగా ఇరగదీశారని టాక్ వస్తోంది. ముఖ్యంగా మైండ్ బ్లాక్ సాంగ్‌లో తన స్టెప్పులతో దరగొట్టారని, దేవీశ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతం మెస్మరైజ్ చేసిందని ప్రేక్షకులు కొనియాడుతున్నారు.
Recommended Video

బొమ్మ దద్దరిల్లింది.. సంక్రాంతి బ్లాక్‌బస్టర్
మొత్తంగా చూస్తే.. మహేష్ బాబు మరోసారి సరిలేరు నీకెవ్వరు అనిపించుకున్నాడు. అన్ని ఏరియాల్లో సినిమాకు టాక్ వినిపిస్తోంది. పర్ఫెక్ట్ పొంగల్ బొమ్మ అంటూ ఆకాశానికెత్తుతున్నారు. అంతేకాదు ''బొమ్మ దద్దరిల్లింది.. సంక్రాంతి బ్లాక్‌బస్టర్'' అని అంటున్నారు.


Click it and Unblock the Notifications











