దేశం గర్వించదగిన సందర్భం.. వెల్లువెత్తుతున్న సినీ ప్రముఖుల ట్వీట్స్

భారత దేశం గర్వించదగిన ప్రయోగం సక్సెస్ ఫుల్‌గా లాంచ్ అయింది. చంద్రుడిపై పరిశోధనల నిమిత్తం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్‌ 2 ఉపగ్రహ ప్రయోగం చేసింది. 3.84లక్షల కి.మీల దూరం ప్రయాణించనున్న ఈ ఉపగ్రహం సెప్టెంబర్‌ 7న చంద్రుడిపై వాలనుంది. జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3ఎం1 వాహకనౌక (రాకెట్‌) ద్వారా పంపిన ఈ ఉపగ్రహానికి 'బాహుబలి' అని పేరు పెట్టారు. సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు శ్రీహరికోటలోని షార్‌ నుంచి ప్రయోగించబడిన ఈ రాకెట్ విజయవంతంగా రోదసీ కక్ష్యలోకి ప్రవేశించింది.

ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. దేశంలోని ప్రముఖులంతా ఇస్రో బృందాన్ని అభినందిస్తూ.. ట్వీట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్, బాలీవుడ్ నుంచి ఎంతో మంది సినీ ప్రముఖులు ఇస్రో బృందాన్ని అభినందించారు. అందులో కొందరి ట్వీట్స్ చూస్తే..

మరో భారీ అడుగు.. మహేష్ బాబు


మరో భారీ అడుగు పడింది. ఈ సారి చంద్రుడి దక్షిణ పోల్ వైపు ప్రయోగం. ఈ క్రెడిట్ కేవలం ఇండియాకు మాత్రమే. చంద్రయాన్ 2ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు నా అభినందనలు. యావత్ దేశానికి ఇది ఎంతో గర్వకారణం. జైహింద్

భారత్‌ ముందడుగు.. నాగార్జున

భారత్‌ మరింత ముందుకు వెళుతోంది. చంద్రయాన్‌ 2ను విజయవంతంగా ప్రవేశపెట్టినందుకు ఇస్రో బృందానికి శుభాకాంక్షలు.

వెరీ ప్రౌడ్.. సమంత

ఇస్రో ప్రయోగించిన ఈ ప్రయోగం గర్వించదగినది. హృదయపూర్వక శుభాకాంక్షలు

ఉత్కంఠకు గురి చేసింది.. మంచు విష్ణు

విజయవంతంగా చంద్రయాన్‌ 2 ఉపగ్రహాన్ని ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు. ఈ ప్రయోగం నన్నెంతో ఉత్కంఠకు గురి చేసింది.

సెల్యూట్‌.. అక్షయ్‌ కుమార్

ఇస్రో నుంచి మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగం విజయవంతంగా పూర్తి చేశారు. చంద్రయాన్‌ 2 విజయం వెనుక ఉన్న రేయింబవళ్లు పనిచేసిన బృందానికి సెల్యూట్‌.

భారత్ ప్రకాశిస్తోంది.. రకుల్‌ప్రీత్‌ సింగ్‌:

చంద్రుపైకి వెళ్లి భారత్ ప్రకాశించబోతోంది. చంద్రయాన్‌ 2 ఉపగ్రహాన్ని ప్రయోగించిన ఇస్రోకు ఆల్ ది బెస్ట్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X